☰
✕
మున్సిపల్ సిబ్బంది నోటీసులకు భయపడి గుండెపోటుతో చిరువ్యాపారి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది.
x
మున్సిపల్ సిబ్బంది నోటీసులకు భయపడి గుండెపోటుతో చిరువ్యాపారి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. మక్తల్ పట్టణంలో కొన్నేండ్ల నుంచి కూరగాయలు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్న బాలమ్మ అనే వృద్ధురాలు, రోడ్డుపై చెత్తతో పాటు కుళ్లిన కూరగాయలు వేస్తుందని మున్సిపల్ సిబ్బంది రూ.200 జరిమానాతో నోటీసులిచ్చారు. మరోసారి రోడ్డుపై అలాగే కుళ్లిన కూరగాయలు వేస్తే రూ.10 వేల వరకు జరిమానా వేస్తామని హెచ్చరించారు. దీంతో కలత చెందిన బాలమ్మ అక్కడే కిందపడిపోయింది. స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ehatv
Next Story