ఆమె చనిపోయిన భర్తను(Late husband) తలచుకోని రోజంటూ లేదు.
ఆమె చనిపోయిన భర్తను(Late husband) తలచుకోని రోజంటూ లేదు. ఆయన జ్ఞాపకాలతోనే మనుగడ సాగిస్తోంది. భర్త స్మృతులను చెట్టులో(tree) చూసుకుంటున్నది. ప్రతి సంవత్సరం అలాగే జయంతి జరుపుతున్నది. వికారాబాద్(Vikarabad) జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్(Muncipal Chairperson) కోట్రిక విజయలక్ష్మి చేసిన పనికి అందరూ శభాష్ అంటుననారు. సోమవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు చనిపోయిన తన భర్త దుస్తులు(Husband cloths) తొడిగి వినూత్నంగా చెట్టుకు పుట్టిన రోజును, భర్తకు జయంతిని జరిపింది. ఎనిమిదేళ్ల కిందట విజయలక్ష్మి భర్త వెంకటయ్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటి ముందు మొక్క నాటారు. ఆయన చనిపోయిన తర్వాత విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇప్పుడా మొక్క చెట్టుగా మారింది. ప్రతి సంవత్సరం కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు అలంకరణ చేసి పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తున్నది. జాతీయ రహదారి వెడల్పులో భాగంగా విజయలక్ష్మి ఇంటి ముందున్న చెట్టును అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తల అనుమతితో చెట్టును జేసీబీ సహాయంతో అక్కడికి తీసుకెళ్లి నాటారు. అక్కడే ఆ చెట్టుకు పూజలు చేసింది. పంచభక్ష పరమాన్నాలతో అందరికి విందు భోజనం పెట్టింది.