వివాహేతర సంబంధాలు(Extra Marital affair) కొందరి జీవితాలను అర్ధాంతరంగా ముగించివేస్తున్నాయి. సమాజంలో కొందరు చేసే పనులకు కాపురాలే కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధాలు(Extra Marital affair) కొందరి జీవితాలను అర్ధాంతరంగా ముగించివేస్తున్నాయి. సమాజంలో కొందరు చేసే పనులకు కాపురాలే కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ యువకుడు బెల్ట్‌తో(Belt) ఉరి వేసుకుని(Hung) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోరంట్ల(Gorantla) మండలం రెడ్డిచెరువుపల్లి(Reddy cheruvu palli) గ్రామానికి చెందిన శివ(shiva)(25), చిలమత్తూరు మండలం కోడూరులోని ఓ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పరిశ్రమలో పనిచేస్తున్న ఓ వివాహితతో(Married women) సన్నిహితంగా మెలిగేవాడు. అయితే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక శనివారం రాత్రి చిలమత్తూరు మండలం మొరంపల్లి సమీపంలో విషం తాగాడు. అనంతరం తన ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రంతా గాలించినా శివ ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఆదివారం ఉదయం చెట్టుకు బెల్టుతో ఉరి వేసుకుని విగత జీవిగా వేలాడుతున్న శివను మొరంపల్లి వాసులు గుర్తించి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుమారుడి మృతికి పరిశ్రమలో పనిచేస్తున్న వివాహితతో పాటు మరో వ్యక్తి కారణమంటూ శివ తండ్రి శ్రీరామప్ప ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Updated On 6 Nov 2023 5:57 AM GMT
Ehatv

Ehatv

Next Story