ఆ ఇంట్లో పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు.. పచ్చని పందిరి ఇంకా అలాగే ఉంది..

ఆ ఇంట్లో పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు.. పచ్చని పందిరి ఇంకా అలాగే ఉంది.. ఇంటి ఆవరణలో పెళ్లి ఆనవాళ్లు కూడా పోలేదు.. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. నూతన దంపతులు దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తల్లి మరణించగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి .సత్తుపల్లి (Sathupally)మండలం బేతుపల్లి వద్ద శుక్రవారం రోడ్డు జరిగింది. సత్తుపల్లికి చెందిన వ్యాపారి అడపా రాజేంద్రప్రసాద్‌ – పుష్పావతి ఏకైక కుమార్తె హర్షిణి వివాహం ఈనెల 16న జరిగింది. కొత్తగా పెళ్లయిన దంపతులతో కలిసి అందరూ అశ్వారావుపేట దగ్గర ఉన్న సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లారు. ఆతర్వాత నూతన దంపతులను జంగారెడ్డిగూడెం(Jangareddy Gudem)లోని అత్తగారి ఇంటికి సాగనంపి.. హర్షిణి(Harshini) తల్లిదండ్రులు పుష్పావతి(Pushpavathi)(55), రాజేంద్రప్రసాద్‌(Rajendra prasad) కారులో సత్తుపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న క్రమంలో బేతుపల్లి సమీపంలో వీరి కారు, ఎదురుగా వచ్చిన పాలవ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుష్పావతి, రాజేంద్రప్రసాద్‌కు గాయాలు కాగా 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేసరికి పుష్పావతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన హర్షిణి తల్లి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కొత్తగా పెళ్లయిన కొన్నాళ్లకే ఈ విషాదం చోటు చేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు

ehatv

ehatv

Next Story