లైంగిక వేధింపులు(abusing) భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా పార్‌పెల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు పెళ్లయి ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10) ఉన్నారు. బతుకుదెరువు కోసం భర్త దుబాయ్(Dubai) వెళ్లాడు. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారులతో కలిసి నిర్మల్‌లోని బెస్తవార్‌పేటలో(Bestawarpet) ఉన్న తల్లి ఇంటి వద్ద నివసిస్తోంది. పార్‌పెల్లి గ్రామానికే చెందిన యువకుడు ఆ మహిళను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ వేధింపులు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..

ఆదిలాబాద్ జిల్లా పార్‌పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్నకు నాగమణి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నాడు. నిర్మల్ బెస్తవార్‌పేటలోని తల్లి కళావతి ఇంటివద్ద నాగమణి ఉంటోంది. నాగమణిని కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు చిలుక వంశీ(chiluka vamsi) ఫోన్‌లో వేధిస్తున్నాడు. లైంగికంగా ఒక్కటవుదామని ప్రతి రోజు ఫోన్ చేసి వేధించేవాడు. రెండు రోజుల కింద తల్లి కళావతితో కూడా ఈ వేధింపుల గురించి చెప్పి బాధపడింది. ఈనెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని(Hanged) ఆత్మహత్య చేసుకుంది. తల్లి కళావతి వచ్చి చూసే సరికి ఉరివేసుకొని ఉంది. స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. నాగమణి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు వంశీపై నిర్మల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాగమణి మృతికి కారణమైన వంశీపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతదేహంతో(Corspe) అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న సీఐ నవీన్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ పార్‌పెల్లికి(Parpelli) చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. తన భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న చిన్న భోజన్న దుబాయ్ నుంచి పార్‌పెల్లికి చేరుకున్నాడు. తన ఇద్దరు కుమారులతో కలిసి నాగమణి మృతదేహం వద్ద రోదించిడంతో స్థానికులు కూడా విషాదం వ్యక్తం చేశారు. పార్‌పెల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.