ఎస్ఐ హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని

ఎస్ఐ హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్(SI Harish)ను కూడా ప్రేమలోకి దించింది.ఈ నెల 14న ఎంగేజ్మెంట్ ఉండగా.. హరీష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి హరీష్‌తో పాటే ఉంది.దీంతో ఈ విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురై ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నక్రమంలో ప్రియురాలు అనసూర్య(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బానోత్ అనసూర్య(Banoth Anasuya), సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.ప్రేమ పేరుతో ఎస్ఐని వేధింపులకు గురిచేసి,ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించారు.గత సంవత్సరం క్రితం రాంగ్ నెంబర్ కాల్ చేసి ఎస్ఐకు పరిచయమైన అనసూర్య హత్య తానే చేసిందా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలియాల్సి ఉంది.
