ఈ నెల 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక(MLC By Elections) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వరంగల్(Warangal), నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam) జిల్లాల పట్టభద్రులు ఓటు వేయనున్నారు.
ఈ నెల 27వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక(MLC By Elections) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వరంగల్(Warangal), నల్లగొండ(Nalgonda), ఖమ్మం(Khammam) జిల్లాల పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాలలో వైన్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్‌లు బంద్ కానున్నాయి. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.