✕
హైదరాబాద్ మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పారు పోలీసులు.

x
హైదరాబాద్ మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. సికింద్రాబాద్(Secundrabad) జంట నగరాల పరిధిలో శనివారం నాడు వైన్ షాపులు(Wine Shops) బంద్ కానున్నాయి.హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా నగరంలో ఏప్రిల్ 12 వ తేదీన వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Cv Anand)ఆదేశాలు జారీ చేశారు. శనివారం అంటే ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కానీ స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని హైదరాబాద్ (Hyderabad)సీపీ తెలిపారు. మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ehatv
Next Story