Vivek Venkata Swamy : వెంకటస్వామి ఫ్యామిలీని వెంటాడుతోన్న S సెంటిమెంట్
పొలిటీషియన్లకు(Politicians) సెంటిమెంట్లు(Sentiments) కాసింత ఎక్కువే! మనం పెద్దగా పట్టించుకోము కానీ రాజకీయ నాయకులు మాత్రం దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, వర్జ్యాలు .. ఇవన్నీ చూసుకున్నాకే పనులు మొదలుపెడతారు. అంతెందుకు నామినేషన్‌ను(Nominations) కూడా ముహూర్తం చూసే వేస్తాను. అచ్చొచ్చిన గుళ్లకు వెళతారు..
పొలిటీషియన్లకు(Politicians) సెంటిమెంట్లు(Sentiments) కాసింత ఎక్కువే! మనం పెద్దగా పట్టించుకోము కానీ రాజకీయ నాయకులు మాత్రం దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, వర్జ్యాలు .. ఇవన్నీ చూసుకున్నాకే పనులు మొదలుపెడతారు. అంతెందుకు నామినేషన్‌ను(Nominations) కూడా ముహూర్తం చూసే వేస్తాను. అచ్చొచ్చిన గుళ్లకు వెళతారు.. అచ్చిరాని ఆలయాలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు గడ్డం వెంకటస్వామి ఫ్యామిలీనే తీసుకోండి. పాపం వారిని ఓ సెంటిమెంట్ తెగ బాధపెడుతోంది. విశ్వనాథ్ సినిమాల్లో చాలా మట్టుకు పేర్లు ఎస్ అనే అక్షరం నుంచే మొదలవుతాయి. అదో సెంటిమెంట్.
వెంకటస్వామి(Venkata Swamy) ఫ్యామిలీకి మాత్రం ఎస్(Letter "S") అనే లెటర్ విపరీతంగా సతాయిస్తోంది. ఎస్ అనే అక్షరంతో పేరున్న నేతలతో పోటీకి దిగిన ప్రతీసారి వెంకటస్వామి ఫ్యామిలీకి పరాజయమే ఎదురయ్యింది. అంగ బలం, అర్థబలం ఎంతున్నా ఓటమిని తప్పించుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్‌లో(Congress) గడ్డం వెంకటస్వామి(Gaddam venkata Swamy) ఓ వెలుగు వెలిగారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆయనకు ప్రజాదరణ కూడా ఎక్కువే! ఆయన పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో నిల్చున్నారంటే పోటీకి విపక్షాలు వణికిపోయేవి. ఆయనకున్న ఆర్ధిక వనరులు, అధికారబలం విజయాలను అలవోకగా తెచ్చిపెట్టేవి.
ఎంతటి బలాడ్యుడైనా ఎప్పుడో ఓసారి ఓడిపోక తప్పదు. తనకు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో తిరుగేలేదన్న ధీమాతో ఉన్న వెంకటస్వామికి 1996లో మొదటిసారి ఓటమి ఎదురయ్యింది. ఆ ఎన్నికల్లో వెంకటస్వామితో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ సుగుణకుమారి(Dr.Suguna Kumari) పోటీపడ్డారు. విదేశాలలో వైద్యురాలిగా స్థిరపడిన సుగుణకుమారి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. తనపై సుగుణకుమారి పోటీ చేయడమేమిటంటూ వెంకటస్వామి వెటకారాలు చేశారు. తన రాజకీయ జీవితమంత లేదు ఆమె వయసు అంటూ ఎకసెక్కాలాడారు.
ముమ్మర ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికలలో వెంకటస్వామి అంగబలం, ఆర్ధబలం పని చేయలేదు. వ్యూహాలు బెడిసికొట్టాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుగుణ కుమారి సంచలన విజయం సాధించారు. సుగుణకుమారి చేతిలో ఓటమిని వెంకటస్వామి తట్టుకోలేకపోయారు. 1998లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మళ్లీ వెంకటస్వామి-సుగుణకుమారి పోటీపడ్డారు. ఈసారి రకరాల ఎత్తుగడలు వేశారు. అవేవీ పని చేయలేదు. రెండసారి సుగుణకుమారి చేతిలో వెంకటస్వామి ఓడిపోయారు.
సుగుణకుమారి చేతిలో వెంటకస్వామి పరాజయంపాలైనట్టుగానే ఆయన కుమారుడు వివేక్ కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ విద్యార్థి నాయకుడి చేతిలో ఓటమి చెందారు. వెంకటస్వామి వారసునిగా 2009 ఎన్నికల్లో వివేక్(Vivek) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో పుష్కలమైన ఆర్థిక వనరులు వెచ్చించి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించింది. జమిలి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ నిలబడ్డారు. ఆయనపై టీఆర్‌ఎస్(TRS) పార్టీ వ్యూహాత్మకగా తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నేత బాల్క సుమన్‌ను పోటీ పెట్టింది. వందల కోట్ల వివేక్ వర్సెస్ వందల కేసుల సుమన్ మధ్య పోరాటం అనే చర్చ జరిగింది.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా సుమన్‌పై(Suman) ఎన్నో కేసులు వేశారు. ఆ ఎన్నికల్లో సుమన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తండ్రి రెండుసార్లు సుగుణ కుమారి చేతిలో ఓడితే కొడుకు సుమన్ చేతిలో ఓడిపోయారు. సుమన్ చేతిలో ఒక సారి ఓటమి తరువాత వివేక్ రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి , ఆ తరువాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి , మళ్ళీ టీఆర్ఎస్ లోకి చేరారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వెన్ను పోటు పొడిచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అందుకే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల తర్వాత వివేక్ బీజేపీలో(BJP) చేరారు. అక్కడ కూడా స్థిరంగా ఉండలేదు. మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఇలా ఆరు సార్లు పార్టీలు మారిన వివేక్ మళ్ళీ పోటీ కి సిద్ధ మవుతున్నారు. చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి వివేక్ లేదా ఆయన కుమారుడు వంశీ కృష్ణ(Vamsi Krishna) కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత సెంటిమెంట్ ప్రకారం వివేక్ వెంకట స్వామి కుటుంబానికి సుమన్ చేతిలో రెండో సారి ఓటమి తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.