రేవంత్‌రెడ్డి నోటి దూల ఆయన మెడకే చుట్టుకోనుందా..?
సుప్రీం కోర్టులో(Supreme court) తన ఓటుకు నోటు కేసు(Note For vote) విచారణ పెట్టుకుని, నిన్న ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) బెయిల్ మజూరు చేయడంపై రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఏకంగా సుప్రీం కోర్టు మీద చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు చివరకు ఆయన మెడకే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని, కనుక ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని వేసిన పిటీషన్ మీద ఇవ్వాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ జరుగుతుండగా హఠాత్తుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిన్న రేవంత్ సుప్రీం కోర్టు మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు. "ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా? ఇలా ఎలా మాట్లాడతారు? రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా?" అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేవంత్ పక్షాన వాదిస్తున్న న్యాయవాది ఏదో సర్దిచెప్పటానికి ప్రయత్నిస్తే న్యాయమూర్తి "మాకవన్నీ చెప్పకండి. ఆయన ప్రవర్తన ఇలా ఉంటే ఆయనను వేరే రాష్ట్రంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. ఆయనకు, ఈ దేశపు అత్యున్నత కోర్టు అయిన సుప్రీం కోర్టు అంటేనే గౌరవం లేదు. ఈ కేసు సోమవారానికి వాయిదా వేస్తున్నాను..." అన్నారు! దీంతో సుప్రీంకోర్టులో రేవంత్‌కు పడిన అక్షింతలు చూశాక రేవంత్ నోటి దురుసే తన మెడకు చుట్టుకుందా అని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.