హైదరాబాద్‌లో (Hyderabad)విద్యుత్ కోతలకు కరెంట్ అధికారులు మానసికంగా మనల్ని సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని టీఎస్ఎస్‌పీడీసీఎల్(TSSPDCL) ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ వెల్లడించారు. వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో రోజుకు 2 గంటల కోతలు(Power Cuts) పెట్టే అవకాశం ఉందని తెలిపారు. సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు.

వేసవి డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఏటా నవంబర్-జనవరి మధ్య మెయింటెనెన్స్ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) వల్ల ఆలస్యమైనట్టు ఫారూఖీ పేర్కొన్నారు. ప్రజల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆయన తెలిపారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపై ఉన్న చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్(Musharraf) తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని కానీ రోజువారీ కోతలు ఉండవని, ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని నెటిజన్ల ప్రశ్నలకు ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు.