మీకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు(Gadala Srinivasa Rao) గుర్తున్నారా? ఎందుకు గుర్తుండరు? పాపం కొత్తగూడెం(Kotha gudem) టికెట్ కోసం కేసీఆర్‌కు(KCR) వంగి వంగి దండాలు పెట్టిన శ్రీనివాసరావును ఎలా మర్చిపోతారు? ఎమ్మెల్యే అవ్వడం కోసం కొత్తగూడెంలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారాయన. ఇంతా చేస్తే ఆఖరి నిమిషంలో కేసీఆర్ ఈయనను కాదని వనమాకే టికెట్ ఇచ్చారు.
మీకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు(Gadala Srinivasa Rao) గుర్తున్నారా? ఎందుకు గుర్తుండరు? పాపం కొత్తగూడెం(Kotha gudem) టికెట్ కోసం కేసీఆర్‌కు(KCR) వంగి వంగి దండాలు పెట్టిన శ్రీనివాసరావును ఎలా మర్చిపోతారు? ఎమ్మెల్యే అవ్వడం కోసం కొత్తగూడెంలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారాయన. ఇంతా చేస్తే ఆఖరి నిమిషంలో కేసీఆర్ ఈయనను కాదని వనమాకే టికెట్ ఇచ్చారు. అప్పట్నుంచి బీఆర్‌ఎస్‌కు(BRS) దూరంగా ఉంటున్న శ్రీనివాసరావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో(congress) చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Elections) కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు! ఖమ్మం(Khammam), సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలలో ఏదో ఒకటి ఆయన ఆశిస్తున్నారు.ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీభవన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టికెట్లు ఇచ్చింది. 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇది చూసే గడల శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాల మోజును వదిలేస్తే శ్రీనివాసరావు సమర్థుడైన అధికారి. కరోనా(Corona) సమయంలో తన పనితీరుతో అందరి మెప్పు సాధించారు. ఆ తర్వాత కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొత్తగూడెంకు చెందిన గడల, తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఒకానొక దశలో ఆయనకు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్‌ను ఇవ్వాలని బీఆర్‌ఎస్ అనుకున్నదట! అందుకే ఆయన కొత్తగూడెంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కాకపోతే కేసీఆర్ చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టి వనమాకే టికెట్ ఇచ్చారు. దీంతో గడల మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం సర్వీసులోనే ఉన్న గడల దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు.