తెలంగాణలో(Telangana) అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ(BJP) నేతలంతా చెబుతూ వస్తున్నారు కానీ పరిస్థితి అలా లేదు. అసలు బీజేపీ కార్యకర్తలకే నమ్మకం లేదు. అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం బీఆర్‌ఎస్‌కు(BRS) గట్టిపోటీనైనా ఇస్తుందా అన్న అనుమానం జనాలకు కలుగుతోంది. ఎన్నికల రేసులో బీజేపీ మూడో ప్లేస్‌లో ఉంటుందని నేతలకు కూడా అర్థమైపోయింది. అందుకే బీజేపీ నుంచి నేతలు సామాన్లు సర్దేసుకుంటున్నారు.

తెలంగాణలో(Telangana) అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ(BJP) నేతలంతా చెబుతూ వస్తున్నారు కానీ పరిస్థితి అలా లేదు. అసలు బీజేపీ కార్యకర్తలకే నమ్మకం లేదు. అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం బీఆర్‌ఎస్‌కు(BRS) గట్టిపోటీనైనా ఇస్తుందా అన్న అనుమానం జనాలకు కలుగుతోంది. ఎన్నికల రేసులో బీజేపీ మూడో ప్లేస్‌లో ఉంటుందని నేతలకు కూడా అర్థమైపోయింది. అందుకే బీజేపీ నుంచి నేతలు సామాన్లు సర్దేసుకుంటున్నారు. కీలకమైన నాయకులంతా కాంగ్రెస్‌లో చేరిపోయారు కూడా! కేసీఆర్‌ను(KCR) ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేతలు ఇప్పుడు బీజేపీలో ఉండటం కంటే గెలిచే అవకాశాలున్న కాంగ్రెస్‌లో(Congress) చేరడం మంచిదనే భావనకు వచ్చారు. అందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. అయితే కొన్నాళ్లుగా పార్టీ మారతారనే వదంతులతో నిత్యం వార్తలలో ఉంటున్న డీకే అరుణ(DK Aruna), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) వంటి నేతల పరిస్థితి ఏమిటన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. వివేక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు బీజేపీలో ఉన్నంత వరకు కీలక నాయకులుగానే ఉన్నారు. బీజేపీలోకి వెళ్లిన తొలినాళ్లలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అయితే ఆ పార్టీని ఆకాశానికెత్తేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత రాజగోపాల్‌రెడ్డికి తత్వం బోధపడింది. అప్పట్నుంచే ఆయనలో అసంతృప్తి మొదలయ్యింది కానీ బయటపడలేదు. పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. అఖరి నిమిషంలో బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లోకి దూకేశారు. ఏకంగా టికెట్‌నే సంపాదించారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు వివేక్ పార్టీ మారతారని చాలా మంది అనుకున్నారు. వివేక్‌ ఎప్పటికప్పుడు అలాంటి వార్తలను ఖండిస్తూ వచ్చారు. అయితే చివరికి జాబితాల ప్రకటన కూడా పూర్తయిన తర్వాత వివేక్ కూడా ఫిరాయించారు.ఇప్పుడు అందరి చూపు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలపై ఉంది..

Updated On 3 Nov 2023 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story