Ex-DGP Anjani Kumar : మాజీ డీజీపీ అంజనీకుమార్‌కు మళ్లీ ఆ పోస్టు ఇస్తారా?
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్(congress) ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంలోని పలుశాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన సాఫిగా సాగాలన్నా..ప్రభుత్వ నిర్ణయాలు సకాలంలో అమలు చేయాలన్నా సమర్ధులైన అధకారులు ఉండటం కీలకం. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన, సమర్ధులైన అధికారులను ఎంచుకునే పనిలోపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.

Ex-DGP Anjani Kumar
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్(congress) ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంలోని పలుశాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన సాఫిగా సాగాలన్నా..ప్రభుత్వ నిర్ణయాలు సకాలంలో అమలు చేయాలన్నా సమర్ధులైన అధకారులు ఉండటం కీలకం. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన, సమర్ధులైన అధికారులను ఎంచుకునే పనిలోపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ముందుగా అత్యంత కీలకమైన లా అండ్ ఆర్డర్‌పై(Law and Order) దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి..మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలను(Commissioner Police) నియమించారు. అయితే ఈసీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌ను(Anjani Kumar IPS) మళ్లీ డీజీపీగా నియమిస్తారా? లేదా అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కోడ్(Election Code) ఉల్లంఘించారంటూ అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని, రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని ఈసీకి వివరణ ఇచ్చిన ఆయన..ఇలాంటిది మరోసారి జరగదని ఈసీకి(Election Commission) హామీ ఇచ్చారు. అంజనీ కుమార్ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ.. సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే ఈలోపే తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను ఈసీ నియమించింది.
ప్రస్తుతం ఆయనే డీజీపీగా కొనసాగుతున్నారు.. ఇప్పుడు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయనకు ఏ పోస్టు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే డీజీపీ హోదాలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరించారనే ముద్ర అంజనీకుమార్ పై ఉంది. అధికార పార్టీ నేతలు చెప్పినట్టే పోస్టింగ్‌లు ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి పోలీస్శాఖలో అలాంటి పైరవీలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి.. ముక్కుసూటి అధికారులను ముఖ్యమైన మూడు కమిషనరేట్లకు సీపీలుగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ ను మళ్లీ డీజీపీగా నియమించే ఛాన్స్ లేనట్టేనట్టేనన్నది అధికారపార్టీ నేతలు చెబుతున్న సమాచారం.
