తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS elections 2023) విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్(Congress) పార్టీకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై(Lok Sabha Elections) దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆల్‌రెడీ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS elections 2023) విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్(Congress) పార్టీకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై(Lok Sabha Elections) దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆల్‌రెడీ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గెలుపు గుర్రాల అన్వేషణలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొరకని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని వినికిడి. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులోకి తీసుకురావాలని అనుకుంటోంది కాంగ్రెస్. లోక్‌సభ బరిలో సీనియర్లను బరిలో దింపాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఇప్పుడు ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాల కోసం చాలా మంది పోటీపడుతున్నారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని(Sonia Gandhi) మల్కాజ్‌గిరి(Malkajgiri) నుంచి పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారట! 2019లో మల్కాజ్‌గిరి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోటీ చేసి గెలిచిన విజయం తెలిసిందే కదా! ఇంతకు ముందు ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. మరి అత్తబాటలో సోనియా పయనిస్తారా? అసలు సోనియా పోటీ చేస్తారా? చేయరా? అన్నది చూడాలి