మహబూబ్‌నగర్(Mahaboobnagar) పార్లమెంట్‌ నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సీఎం రేవంత్‌(CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా ఉంది. కొడంగల్‌తో పాటు నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, మక్తల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

మహబూబ్‌నగర్(Mahaboobnagar) పార్లమెంట్‌ నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సీఎం రేవంత్‌(CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్(Kondagal) నియోజకవర్గం కూడా ఉంది. కొడంగల్‌తో పాటు నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, మక్తల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.

అయితే గత మూడు ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్‌ఎస్‌ వరుసగా గెలుస్తూ వస్తోంది. 2009లో కేసీఆర్‌ ఇక్కడ గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌లో(BRS) ఉన్న జితేందర్‌రెడ్డి(Jitender Reddy) ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో కూడా మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు. అయితే ఈ సారి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.

2019లో ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థికి 4,11, 402 ఓట్లు అంటే (41.78శాతం) సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణకు 3, 33, 573 ఓట్లు అంటే (33.88) శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్‌రెడ్డికి 1,93,63 ఓట్లు (19.67) శాతం వచ్చాయి. 78 వేల ఓట్ల మెజార్టీతో మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు.

అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే..

కొడంగల్‌లో 2018లో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి 9,319 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అదే 2023లో 32,532 ఓట్ల మెజార్టీతో రేవంత్‌రెడ్డి గెలుపొందారు. 2014లో కూడా రేవంత్‌రెడ్డి 14 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

దేవరకద్ర నియోజకవర్గంలో 2014, 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2018లో ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డికి 35 వేల ఓట్ల మెజార్టీరాగా.. 2014లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే 2023లో ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి 1392 స్వల్ప ఓట్లతో మధుసూదన్‌రెడ్డిపై ఓడిపోయారు.

మక్తల్ నియోజకవర్గంలో 2014లో, 2018లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన రామ్మోహన్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 10 వేల ఓట్ల మెజార్టీతె గెలవగా.. అదే అభ్యర్థి 2018లో 48 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. 2023కు వచ్చేటప్పటికి 17 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వాకాటి శ్రీహరిపై ఓడిపోయారు.

నారాయణపేట నియోజకవర్గం నుంచి రాజేందర్‌రెడ్డి 2014లో 2270 ఓట్లతో టీడీపీ అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో కూడా రాజేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ 15 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2023లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్తి చిట్టెం పర్ణికారెడ్డి (చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు) దాదాపు 8 వేల ఓట్లతో గెలుపొందారు.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి 2014, 2018లో శ్రీనివాస్‌గౌడ్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2014లో కేవలం 3 వేల మెజార్టీ సాధించిన శ్రీనివాస్‌గౌడ్‌, 2018లో దాదాపు 58 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2024లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో దాదాపు 19 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇక జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే జడ్చర్లలో 2014లో, 2018లో లక్ష్మారెడ్డి గెలుపొందారు. తెలంగాణ తొలి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2018లో 45 వేల ఓట్లతో గెలిచిన లక్ష్మారెడ్డి, 2023లో 15 వేల ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక షాద్‌నగర్‌ విషయానికొస్తే 2014, 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అంజయ్యయాదవ్‌ గెలిచారు. 2018లో అంజయ్యయాదవ్‌కు 20 వేలకుపైగా మెజార్టీ రాగా.. 2023లో 7 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి శంకరయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.

ఓవరాల్‌గా చూసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే బీఆర్‌ఎస్‌కు దాదాపు 2.30 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చేసరికి కేవలం 80 వేల మెజార్టీ మాత్రమే సాధించింది. అంటే దాదాపు 1.5 లక్షల ఓట్లు తగ్గిపోయాయి.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చేసరికి అనూహ్యంగా మూడో స్థానంలోకి పడిపోయింది.

అదే సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో మూడో స్థానంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా డీకే అరుణను బరిలోకి దింపి రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక 2024 ఎన్నికలకు వస్తే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దాదాపు లక్ష ఓట్లు అధికంగా సాధించింది. అయితే ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ఇదేవిధంగా పర్‌ఫార్మ్‌ చేస్తే లక్ష ఓట్లు లేదా కనీసం ఓ 20-30 వేల ఓట్లు తగ్గినా కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి. 2018లో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే కనీసం 2 లక్షల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలి.. కానీ ఎంపీ ఎన్నికలు వచ్చేనాటికి అది కేవలం 80 వేల మెజార్టీకి పడిపోయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌కు లక్ష ఓట్ల మెజార్టీ ఉంది.. ఎంపీ ఎన్నికలు వచ్చేనాటికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న సస్పెన్స్‌ అయితే నెలకొని ఉంది.

Updated On 5 March 2024 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story