Telangana Assembly Elections 2023 : చరిత్ర పునరావృతం అవుతుందా?
చూడబోతే చరిత్ర పునరావృతం అయ్యేట్టుగానే కనిపిస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TElangana Assembly Elections) మునుపు ఎలాంటి వాతావరణం ఉన్నదో ఇప్పుడూ అలాంటి వాతావరణమే ఉన్నది. టీఆర్‌ఎస్(TRS) అధికారంలోకి రావడం కష్టమేనని అనుకున్నారంతా! కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి అధికారం సాధించేటన్ని సీట్లు రావడం తథ్యమని చిలుకజోస్యాలు చెప్పేవారి దగ్గర నుంచి లగడపాటి వరకు చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్(congress), టీడీపీ(TDP), వామపక్షాలు కుదుర్చుకుని బలంగా ఉన్నట్టుగా అనిపించింది. ఓ వర్గం మీడియా ఉత్సాహంతో పేజీలకు పేజీలు నింపేశాయి. […]
చూడబోతే చరిత్ర పునరావృతం అయ్యేట్టుగానే కనిపిస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TElangana Assembly Elections) మునుపు ఎలాంటి వాతావరణం ఉన్నదో ఇప్పుడూ అలాంటి వాతావరణమే ఉన్నది. టీఆర్‌ఎస్(TRS) అధికారంలోకి రావడం కష్టమేనని అనుకున్నారంతా! కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి అధికారం సాధించేటన్ని సీట్లు రావడం తథ్యమని చిలుకజోస్యాలు చెప్పేవారి దగ్గర నుంచి లగడపాటి వరకు చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్(congress), టీడీపీ(TDP), వామపక్షాలు కుదుర్చుకుని బలంగా ఉన్నట్టుగా అనిపించింది. ఓ వర్గం మీడియా ఉత్సాహంతో పేజీలకు పేజీలు నింపేశాయి. కానీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్(BRS) ఘన విజయాన్ని సాధించింది.
మహాకూటమి నామరూపాల్లేకుండా పోయింది. అందుకు కారణం తెలుగుదేశంపార్టీ)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే! ఇది కేసీఆర్(KCR)కు బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) చేతుల్లోకి తెలంగాణ పాలనా పగ్గాలు పోతాయని, ఆంధ్ర (Andra)పీడ ఎప్పటికీ తొలగిపోదని కేసీఆర్ చెప్పిన మాటలు తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాయి. తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు మళ్లీ రగులుకుంది. ఏ చంద్రబాబు పాలననైతే తెలంగాణ ప్రజలు చీదరించుకున్నారో, ఛీకొట్టారో మళ్లీ ఆ చంద్రబాబు పాలనే వస్తున్నదంటే ఎలా సహిస్తారు? అందుకే మహాకూటమిని బంగాళాఖాతంలో విసిరేశారు.
కాంగ్రెస్ పార్టీ చేజేతులా సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ తమ ఓటమికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమేనని ఆలస్యంగా తెలుసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగింది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు (Elections)దగ్గరకొచ్చాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించి ఎన్నికలకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ కూడా 55 మంది అభ్యర్థులతో మొదటి లిస్ట్(First list) ప్రకటించింది. సర్వేలు(Surveys)ఏం చెబుతున్నా తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ(Political) వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తే మరోసారి కాంగ్రెస్‌పార్టీపై చంద్రబాబు దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth reddy)లో చంద్రబాబును తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.
అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత హైదరాబాద్(Hyderabad)లో నివసిస్తున్న ఆంధ్ర కమ్మ సామాజికవర్గం చేస్తున్న పనులు పరోక్షంగా కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయి. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా చంద్రబాబు పాలన తెచ్చుకున్నట్టు అవుతుందని కొందరు కమ్మ నాయకులు బహిరంగంగానే ప్రకటనలు ఇచ్చారు. మైకుల ముందుకొచ్చి బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని, తామంతా కాంగ్రెస్‌కే ఓటేస్తామని చెబుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధినేత కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఇలాంటి పలుకులే పలుకుతున్నారు. వారాంతపు ప్రోగ్రామ్‌లో ఇలాంటి రాతలే రాస్తున్నారు. ఇది సహజంగానే రెడ్డి సామాజికవర్గానికి చికాకు పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన రెడ్లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అత్యధికంగా 42 స్థానాలను రెడ్లకు కేటాయించింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి(Revanth reddy)ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సామాజికవర్గం పెత్తనం చెలాయిస్తుందేమోనన్న భయం రెడ్లలోనూ, తెలంగాణ ప్రజల్లోనూ ఉంది. వైఎస్ షర్మిల(Y. S. Sharmila)ను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్న రేవంత్‌రెడ్డిపై కొందరు రెడ్లు కోపంతో ఉన్నారు. వీరందరికీ రేవంత్‌రెడ్డిలో చంద్రబాబు కనిపిస్తున్నారు. తెలంగాణ నివసిస్తున్న సీమాంధ్రులు కూడా రెండుగా చీలిపోయారు. కమ్మవర్గం అంతా రేవంత్‌రెడ్డికి జైకొడుతుంతే, సీమాంధ్రులలోని మిగతా సామాజికవర్గంవారు బీఆర్‌ఎస్ వెంట ఉండాలనే అభిప్రాయానికి వచ్చారట! ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది.. ఈ 40 రోజులలో గాలి ఎట్నుంచి ఎటువైపు మళ్లుతుందో చెప్పడం కష్టం. కాకపోతే రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆచితూచి మాట్లాడటం ఆ పార్టీకి మంచిది.