తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి ఇప్పుడు ఖమ్మంపైనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం లోక్‌సభ స్థానంకు(Khammam Constituency) ప్రత్యేక స్థానం ఉంది. ఖమ్మం నియోజకవర్గం తెలంగాణలోనే ఓ కీలక నియోజకవర్గంగా ఉంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి ఇప్పుడు ఖమ్మంపైనే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం లోక్‌సభ స్థానంకు(Khammam Constituency) ప్రత్యేక స్థానం ఉంది. ఖమ్మం నియోజకవర్గం తెలంగాణలోనే ఓ కీలక నియోజకవర్గంగా ఉంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మొత్తంగా 5,67,459 ఓట్లు సాధించారు. నామా నాగేశ్వర రావు తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరిపై విజయం సాధించారు. రేణుకా చౌదరికి వచ్చిన ఓట్లు 3,99,397. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 75.18 % పోలింగ్ జరిగింది.
అయితే ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉండడం.. ఆ మంత్రులు తమ వారికి టికెట్ ఇప్పించుకోవడం విశ్వప్రయత్నాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి టికెట్ ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ నందినికి టికెట్ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానకు సూచించారు
మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas) కూడా తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. తన సోదరుడు ప్రసాద్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని.. అలా లేని పక్షంలో రామసహాయం రఘురామిరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా తమ కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు కష్టపడ్డారు. అంతేకాకుండా తన కొడుకుకు ఇవ్వలేని పక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, రాయల నాగేశ్వరరావు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు, వీరిలో ఒకరి పేరును ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ వచ్చారు. ఒకే సీటుపై ముగ్గురు మంత్రులు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక సంక్లిష్టంగా మారింది. తాజాగా, పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురాంరెడ్డికే టికెట్ కేటాయించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డిని ప్రకటించింది.
రఘురామిరెడ్డి(Raghu rami reddy) తండ్రి, కాంగ్రెస్(congress) పార్టీలో సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. రఘురామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రితను వివాహం చేసుకోగా.. చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి(Ponguleti Prasad reddy) అభ్యర్థిత్వం ఖరారైతే ఎన్నికలు టఫ్‌గా ఉంటాయని బీఆర్‌ఎస్ భావించింది. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కాకుండా అభ్యర్థి ఎవరైనా తామే గెలుస్తామన్న ధీమాను నామా నాగేశ్వరరావు వ్యక్త పరుస్తున్నారు. మరోసారి ఎంపీగా గెలిచి తన జిల్లాపై తన పట్టు నిలుపుకోవాలని నామా నాగేశ్వరరావు ఎత్తులు వేస్తున్నారు. ఖమ్మ సామాజిక వర్గం ఈ సారి తనకే మద్దతిస్తారని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా లేకున్నా 2019లో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈ సారి అదే తరహాలో జిల్లా ప్రజలు తనను ఆదరిస్తారని నామా నాగేశ్వరరావు భావిస్తున్నారట.
మరోవైపు బీజేపీ(BJP) నుంచి తాండ్ర వినోద్‌రావును(Thandra Vinodh Rao) పోటీలోకి దింపింది. కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా, అనేక చారిత్రక పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్న ఖమ్మం.. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా నిలిచింది. రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో బీజేపీకి ఓట్లు ఏ మేరకు సాధిస్తోందని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ-జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు పరిశీలిస్తే ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొంది.
మొత్తానికి పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) మధ్యనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి. ఖమ్మం ఖిల్లాపై ఎవరి జెండా ఎగురుతుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగక తప్పదు.