నేరుగా కేసీఆర్‌ దగ్గరికి కవిత?

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్(BRS) నేతలు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్(KCR) కూతురు కవిత ఐదు నెలల తర్వాత తిరిగి స్వరాష్ట్రానికి వస్తుండటంతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో కవిత తిహార్ జైలులో ఐదు నెలలకు పైగా శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే నేరుగా ఆమె కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు వెళ్లి తండ్రి ఆశీర్వాదం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్‌ కూడా కూతురు బెయిల్‌ కోసం శ్రమించారు. కూతురు జైలు పాలుకావడంతో కేసీఆర్‌ తీవ్ర మనో వేదనను అనుభవించారట. కవిత కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తుందని పలు సందర్భాల్లో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కవిత కేసు వాదిస్తున్న లాయర్లతో స్వయంగా ఆయనే మాట్లాడారు. కవిత బెయిల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆయన, ఇప్పుడు కాస్త రిలీఫ్‌ చెంది పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడతారని తెలుస్తోంది. తెలంగాణ భవన్‌కు తరుచుగా వస్తూ నాయకులకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story