పెళ్లప్పుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చేయిస్తారు
పెళ్లప్పుడు ఒకరికొకరు తోడుండాలని వధూవరులతో వాగ్దానం చేయిస్తారు .నాతి చరామి అనిపిస్తారు. ఖమ్మంకు చెందిన దంపతులు వివాహం రోజు చేతిలో చెయ్యి వేసుకుని చేసుకున్న బాసలను నిజం చేసుకున్నారు. పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను కాలేయ సమస్యతో(Liver) బాధ పడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా కాలేయం మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్క పోవడంతో అతని భార్య(wife) లావణ్య ముందుకొచ్చింది. ఆమె నుంచి 65 శాతం లివర్ (Liver donation)తీసి సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు..ధారావత్ శ్రీను ఖమ్మం లోని ఏపీజీవీబీ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడ్డారు .ఖమ్మం(Khamam) లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు.. లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నాడు . అయినా ఫలితం లేకుండాపోయింది.
వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు.కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు.. భర్తను బ్రతికించుకోవడానికి.. లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడు కోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65 శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు.. సర్జరీ విజయవంతం అయ్యింది.. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు..