ప్రేమి౦చి పెళ్లి చేసుకున్న భర్తనే కసాయిగా హతమార్చింది ఓ భార్య..చెడు వ్యసనాలకు బానిసైన ఆ భార్యను మందలించడమే ఆ భర్త చేసిన తప్పు. ఈ ఘటనకు సంబ౦ధి౦చి పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సంజయ్ గాంధీనగర్ కు చె౦దిన సంతోష్ (28) అతని భార్య రేణుక (24) లు 2016 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .సురేష్ అటో నడుపుకుంటూ కుటు౦బాన్ని పోషి౦చుకు౦టున్నాడు . వీరికి ఇద్దరు కుమార్తెలు . వీరి పెళ్ళైన ఏడాదికే […]

ప్రేమి౦చి పెళ్లి చేసుకున్న భర్తనే కసాయిగా హతమార్చింది ఓ భార్య..చెడు వ్యసనాలకు బానిసైన ఆ భార్యను మందలించడమే ఆ భర్త చేసిన తప్పు. ఈ ఘటనకు సంబ౦ధి౦చి పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ సంజయ్ గాంధీనగర్ కు చె౦దిన సంతోష్ (28) అతని భార్య రేణుక (24) లు 2016 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .సురేష్ అటో నడుపుకుంటూ కుటు౦బాన్ని పోషి౦చుకు౦టున్నాడు . వీరికి ఇద్దరు కుమార్తెలు . వీరి పెళ్ళైన ఏడాదికే రేణుక చెడు వ్యసనాలకు బానిసయ్యింది.కల్లు తాగడానికి తరచు కల్లు దుకాణానికి వెళ్తున్న రేణుక కి ...దుండిగల్ తండాకు చెందిన 17 ఏళ్ళ బాలిక పరిచయం అయ్యింది . ఆ అమ్మాయిని తనతో పాటే ఇంటికి తెచ్చుకుంది.

అయితే రేణుక చెడు వ్యసనాలపై భర్త సురేష్ మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది . దీంతో ఎలా అయిన భర్త సురేష్ అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ చేసింది . అదే రోజు రేణుక ప్లాన్ లో భాగంగా భర్త సురేష్ కు పుల్ గా మద్యం తాగించి ...తరువాత రేణుక , బాలిక కూడా మద్యం తాగారు ..మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న సురేష్ ను...చున్నీతో సురేష్ మెడకు బిగించి , బాలిక సహాయం తో హత్యా చేసింది .ఆ తర్వాత సురేష్ డెడ్ బాడీ ని సంచిలో మూట కట్టి ఇంటి బయట పడేసింది .విషయం తెలిసిన పోలీసులు విచారణ చేపట్టగా .. విచారణలో భార్య రేణుక , బాలిక ఇద్దరు కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు . వీరి ఇద్దరిని పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు .

Updated On 18 Feb 2023 6:02 AM GMT
Ehatv

Ehatv

Next Story