వావివరసలు మరిచిన ఓ మహిళ తనకు అల్లుడి వరుసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త చూసి మందలించాడు.

వావివరసలు మరిచిన ఓ మహిళ తనకు అల్లుడి వరుసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి చనిపోయినట్లు నాటకమాడారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. భార్య, అల్లుడు ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఆదివారం స్థానిక పోలీసులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు కావేరమ్మపేట శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలోనే ఉండే అల్లుడు వరుసయ్యే మీనుగ రాజ్‌కుమార్‌తో అలివేలుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భర్త ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పద్ధతిని మానుకోవాలని మందలించాడు.

అయితే ఓ వివాహానికి బంధువులతో కలిసి షాదనగర్ వెళ్లి తిరిగివచ్చిన భర్తకు కంట వీరు రతిక్రీడ కనపడింది. అలివేలు, రాజ్‌కుమార్ తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి భర్త నిలదీశాడు. విషయం బయటకు ఎక్కడ చెప్తాడోనని భావించిన వీరిద్దరూ కోటయ్యను కింద పడేసి గొంతుకు చెన్నీ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లోనే పడుకోబెట్టి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. మరుసటిరోజు తన భర్త రాత్రి పెళ్లికి వెళ్లి తిరిగిరాలేదంటూ అలివేలు పిల్లలను బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి చేరుకుంది. కింద పడి ఉన్న భర్త కోటయ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ehatv

ehatv

Next Story