టాపింగ్ అంశం లో విచారణ చేయడానికి కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నాయని.. కేంద్రంలో బీజేపీ ఎందుకు దీనిపై యాక్షన్ తీసుకోట్లేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
టాపింగ్ అంశం లో విచారణ చేయడానికి కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నాయని.. కేంద్రంలో బీజేపీ ఎందుకు దీనిపై యాక్షన్ తీసుకోట్లేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ బీఆర్ఎస్ సహకారం చేసేలా ఉందన్నారు. మా మంత్రుల ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. మీ చేతిలోనే అధికారం ఉంటే.. ఎందుకు బీజేపీ టాపింగ్ అంశంలో విచారణ చేయట్లేదని ప్రశ్నించారు.
3మెన్ కమిటీ నీటి కరువుపై మీ హయాంలోని ముందే చెప్పారు.. వరుణ దేవుడిని మేము వానలు పడొద్దని ఏమైనా పూజలు చేశామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాత స్కీమ్‌లకు కలర్ వేసి బీఆర్ఎస్ వాడుకుందని అన్నారు. కరువు పుట్టించడానికి మేం దేవుళ్లమా.. బీఆర్ఎస్ పార్టీ తీరు మార్చుకోవాలని సూచించారు.