వరంగల్‌ జిల్లా(Warangal) తొలి మహిళా కలెక్టర్‌గా సేవలందించిన ఆమ్రాపాలి(amrapali) గతంలో డిప్యూటేషన్ మీద కేంద్రానికి వెళ్లారు.

వరంగల్‌ జిల్లా(Warangal) తొలి మహిళా కలెక్టర్‌గా సేవలందించిన ఆమ్రాపాలి(amrapali) గతంలో డిప్యూటేషన్ మీద కేంద్రానికి వెళ్లారు. 2020 నుంచి పీఎంఓ ఆఫీసులో డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అయితే.. ఆమె సేవలు 2026 వరకు ఉండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఏరికోరి ఆమెను తెలంగాణకు తెచ్చుకున్నారు. ఆమెకు బాధ్యతలు పెంచారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌ పర్యటన సందర్భంగా ఆయన వెంట ఆమ్రాపాలి కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న.. కాట ఆమ్రపాలీకి జీహెచ్ఎంసీ పూర్తిస్థాయి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమ్రపాలి దూకుడు పెంచారు. తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలు శాఖలను సమన్వయపరుస్తూ జీహెచ్‌ఎంసీలో సిబ్బంది పనితీరును మెరుగుపరుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు చేస్తూ సిబ్బందికి చుక్కలు చూపించారు.. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని అధికారులను ఆదేశించిన కమిషనర్.. స్వచ్ఛ ఆటోల మూమెంట్, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా పర్యవేక్షించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‏లను తొలగించాలని చెప్పారు. రోడ్ల పై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆమ్రపాలి.

అయితే తన పనితీరుతో ముఖ్యమంత్రి మెప్పు పొందుతున్న ఆమ్రాపాలికి పెద్ద చిక్కే వచ్చి పడింది. తెలంగాణలోని 11 మంది ఐఏఎస్‌ అధికారులు ఏపీలో(Andhra Pradsh) రిపోర్ట్‌ చేయాలని కేంద్రం నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. అందులో ఆమ్రాపాలి కూడా ఉన్నారు. వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్, ఆమ్రాపాలి, వాణిప్రసాద్, ప్రశాంతి ఉన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణ క్యాడర్‌ కావాలన్న 11 మంది ఐఎఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆమ్రాపాలి ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. మూసీ సుందరీకరణ అంటూ దూకుడుగా వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సమర్థవంతమైన ఐఏఎస్‌గా పేరున్న ఆమ్రాపాలిని హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమించి.. ఆమె ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని అనుకున్న సీఎం రేవంత్‌కు అడ్డుకట్ట పడింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సీఎం రేవంత్‌ ఎవరిని నియమిస్తారోనని ఆసక్తికర అంశమైంది.

Eha Tv

Eha Tv

Next Story