తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గంలో నిజామాబాద్(Niazamabad) ఒకటి. ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 8,08,939 ఉంటే.. మహిళా ఓటర్ల సంఖ్య 8,19,064 ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచి విజయం సాధించారు.
తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గంలో నిజామాబాద్(Niazamabad) ఒకటి. ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 8,08,939 ఉంటే.. మహిళా ఓటర్ల సంఖ్య 8,19,064 ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి మధుయాస్కీ గౌడ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014లో బీఆర్ఎస్(BRS) నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్సే గెలిచిందని చెప్పాలి. నిజామాబాద్ నియోజకవర్గంలో ఒకసారి బీఆర్‌ఎస్ గెలిస్తే కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో నెలకొనబోయే పోటీపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ పోటీ ఇద్దరి మధ్యనా లేదా ముగ్గురి మధ్యనా అన్న అంశం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ 2, బీజేపీ 2, బీఆర్‌ఎస్ 3 సీట్లు గెలుచుకున్నాయి. మూడు పార్టీలు ఓట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నాయి.
కాంగ్రెస్(congress) నుంచి సీనియర్ నేత జీవన్‌రెడ్డి(Jeeavan Reddy) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఊపుమీదుంది. ఈ క్రమంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కాంగ్రెస్ రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ ఓట్లు మాత్రం భారీగా సాధించింది. జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కు అధికారం దక్కడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులందరికీ కలిపి 4,08,135 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వ అండదండలు జీవన్‌రెడ్డికి ఇన్న ఇమేజ్ తమకు కలిసి వచ్చే అంశాలని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది.
మరోవైపు బీజేపీ(BJP) నుంచి 2019లో గెలిచిన అభ్యర్థి అర్వింద్(Arvindh) ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన రెండో సారి గెలిచి తన సత్తా చాటాలని వ్యూహాలు పన్నుతున్నారు. మోడీ చరిష్మా, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశాలకు తనకు కలిసి వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి గతంలో కంటే భిన్నంగా 3.65 లక్షల ఓట్లను బీజేపీ పొందింది. దేశ వ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు తమకు కలిసి వచ్చి మరోసారి కూడా సునాయసంగా గెలుస్తామన్న ఆశల్లో బీజేపీ ఉంది.
ఇక బీఆర్‌ఎస్ విషయానికొస్తే ఇందూరు పార్లమెంట్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్దన్(Baji reddy Vardhan) బరిలోకి దిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ టికెట్లపై వరుస ఎన్నికల్లో గెలిచిన ఘనత సాధించారు. నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి అంటే ఆర్మూర్, బాన్సువాడ, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ఆయన గెలుపొందారు. డీలిమిటేషన్ తర్వాత డిచ్‌పల్లి నియోజకవర్గం కనుమరుగైంది. దీనిని నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంగా మార్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈ పార్లమెంట్ పరిధిలో ఆయనకు గట్టి పట్టు ఉంది. బాజిరెడ్డి గోవర్దన్, అర్వింద్ ఇద్దరూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. అయితే గత ఎన్నికల్లో ఈ సామాజికవర్గంవారు గంప గుత్తగా అర్వింద్‌కు గుద్దేశారు. ఈ సారి కూడా ఒకవైపునే ఉంటారా.. ఇద్దరూ ఈ సామాజికవర్గం ఓట్లను చీల్చుతారా అన్న అంశం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తనకు సత్సంబంధాలున్నాయని.. ఈ సారి గెలుపు తనదేనన్న ధీమాతో బాజిరెడ్డి గోవర్దన్ ఉన్నారు.