ఉమ్మడి మహబూబ్‎నగర్(Mahaboobnagar) జిల్లాలో ఆ ఎంపీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. గెలుపు గ్యారంటీ అంచనాలతో పోటాపోటీగా పావులు కదుపుతున్నారట ఆ పార్టీ నేతలు. అయితే..బయట నుంచి మరో వ్యక్తి అదే సీటుపై కన్నేశారన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ(Congress) ఆశావహుల్లో ఆందోళన మొదలైందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఆశావహుల లెక్కలేంటి? బయట నుంచి వచ్చే ఆ వ్యక్తి ఎవరు?

ఉమ్మడి మహబూబ్‎నగర్(Mahaboobnagar) జిల్లాలో ఆ ఎంపీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. గెలుపు గ్యారంటీ అంచనాలతో పోటాపోటీగా పావులు కదుపుతున్నారట ఆ పార్టీ నేతలు. అయితే..బయట నుంచి మరో వ్యక్తి అదే సీటుపై కన్నేశారన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ(Congress) ఆశావహుల్లో ఆందోళన మొదలైందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఆశావహుల లెక్కలేంటి? బయట నుంచి వచ్చే ఆ వ్యక్తి ఎవరు?

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులెవరనేదానిపై ఆసక్తి నెలకొంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయిన నాగర్‌ కర్నూల్‌ స్థానం ఎంపీ అభ్యర్థి ఫైనల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు పరిధిలో అచ్చంపేట, అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్(Nagar kurnool), వనపర్తి, గద్వాల్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అలంపూర్, గద్వాల్ మినహా ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ఇది తమ విజయానికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు ఎంపీ సీటు ‎ఆశావహులు. గత చరిత్ర చూసినా..ఇక్కడ కాంగ్రెస్ కే అనుకూలత ఎక్కువగా ఉండటంతో సీటు కోసం పోటీ పెరిగినట్టు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వుడ్ సీటును మొదటి నుంచి టీపీసీసీ(TPCC) ఉపాధ్యక్షుడు మల్లు రవి(Mallu Ravi) ‎ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ వేదికల నుంచి కూడా.. తాను ఎంపీగా బరిలో ఉంటానని, ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇక నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్ ఇక మల్లు రవిదేనని అనుకున్న సమయంలో.. ప్రభుత్వం ‎ఆయనను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అయినప్పటికీ తాను పోటీ చేసి తీరుతానని తేల్చేశారు మల్లు రవి. పోటీకి తన పదవి అడ్డు వస్తుందని అనుకుంటే..ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పోస్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమని చెప్పారు. అదే సమయంలో మల్లు రవికి బదులు మరెవరికైనా సీటు ఇస్తారా అన్న చర్చ కూడా మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‎ఎస్ నుంచి కాంగ్రెస్‎లో చేరిన మాజీ ఎంపీ మందా జగన్నాథం(MP Manda Jaganadham) కూడా.. ఎంపీ రేసులో నేనున్నానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానంటూనే పార్టీ మారే సమయంలోనే ఈ విషయాన్ని పెద్దల దృష్టిలో పెట్టానంటున్నారు. ఇక అలంపూర్ నుంచి ‎ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్(Sampath Kumar) తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న నాయకులు.. పోటాపోటీగా పావులు కదుపుతున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి..ఎంపీగా ఛాన్స్ ఇస్తారో లేదో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్(MP) సిట్టింగ్ ఎంపీ రాములు(Ramulu) పేరును కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఎంపీ రాములు తనయుడు భరత్(Bharath) కూడా ముఖ్యమంత్రి రేవంత్‎రెడ్డితో టచ్‎లో ఉన్నారన్నది లోకల్ టాక్. ఎన్నికలకు ముందే రాములు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్‎ను పార్టీలోని ఆ ముగ్గురిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా? లేదా.. బయట నుంచి వచ్చే వ్యకి ఎగరేసుకుపోతాడన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ‎ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 29 Jan 2024 8:35 AM GMT
Ehatv

Ehatv

Next Story