తెలంగాణలో ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్(BRS) అవతరించింది. బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను(KCR) ఆ పార్టీ ఎన్నుకుంది. అయితే ఈ సారి తెలంగాణ బీజేపీ కూడా బాగానే పుంజుకుంది. గత ఎన్నికల్లో 8 శాతం ఓట్లతో ఒక్క సీటు గెలుచుకుంటే.. ఈసారి తన ఓట్ షేర్‌ను 16 శాతం వరకు పెంచుకొని 8 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేసింది.
తెలంగాణలో ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్(BRS) అవతరించింది. బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను(KCR) ఆ పార్టీ ఎన్నుకుంది. అయితే ఈ సారి తెలంగాణ బీజేపీ కూడా బాగానే పుంజుకుంది. గత ఎన్నికల్లో 8 శాతం ఓట్లతో ఒక్క సీటు గెలుచుకుంటే.. ఈసారి తన ఓట్ షేర్‌ను 16 శాతం వరకు పెంచుకొని 8 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేసింది. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, గోషామహల్ స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ పట్టున్న బీజేపీ.. ఈ సారి ఉత్తర తెలంగాణలో పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. కామారెడ్డిలో(Kamareddy) బీజేపీ(BJP) సంచలన విజయం నమోదు చేసుకుంది. తాజా, మాజీ ముఖ్యమంత్రులను ఓడించి బీజీపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి(Venkatramana Reddy) చరిత్ర సృష్టించారనే చెప్పాలి. అయితే ఎంపీలుగా ఉన్న అర్వింద్(Arvind), బండి సంజయ్(Bandi sanjay), సోయం బాపూరావు ముగ్గురూ ఓడిపోయారు. మరో కీలక నేత ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో ఓడిపోయారు.
అయితే ఇప్పుడు బీజేఎల్పీ నేత(BJLP Leader) చర్చనీయాంశమైంది. బీజేపీఎల్పీ నేత రేసులో ముగ్గురు పోటీ పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే బీజేఎల్పీ నేతగా ఎంపిక చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన రాజాసింగ్.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకు బీజేపీ టికెట్ సుగుమమైంది.
ఇక మరో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి(Maheswar Reddy) కూడా బీజేఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలనని ఆయన వాదన. తెలుగుభాషపై రాజాసింగ్‌కు గట్టిపట్టు లేకపోవడంతో.. సభలో అంశాలవారీగా చర్చించాలంటే గట్టి వాయిస్ అవసరమని మహేశ్వర్‌రెడ్డి వాదన. ఇక తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ స్టార్ అయిన మరో ఎమ్మెల్యే కె.వెంకటరమణారెడ్డి కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానని.. బీజేపీ వల్లే తనకు ఆ అవకాశం దక్కిందని.. బీజేఎల్పీ నేతగా అవకాశమిస్తే.. తాను ఓడించిన అధికారపక్ష నేత రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను సభలో కూడా ఎదుర్కొంటానని ఆయన విశ్వాసంగా ఉన్నారట.