ఆద్యంతం ఉత్కంఠభరితంగా హైకోర్టులో వాదనలు సాగాయి. సాధారణంగా.. రిమాండ్ విధించిన తర్వాత క్వాష్ పిటిషన్‌లో బెయిల్ ఇవ్వరు కానీ..

ఆద్యంతం ఉత్కంఠభరితంగా హైకోర్టులో వాదనలు సాగాయి. సాధారణంగా.. రిమాండ్ విధించిన తర్వాత క్వాష్ పిటిషన్‌లో బెయిల్ ఇవ్వరు

కానీ.. హైకోర్టు తన విచక్షణ అధికారంతో అల్లు అర్జున్‌(Allu Arjun)కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బన్నీ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి తన వాదనలతో బెయిల్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. అర్నబ్ గోస్వామి కేసుని మెన్షన్ చేస్తూ.. బెయిల్ సంపాదించిన నిరంజన్ రెడ్డి(Niranjan Reddy). అల్లు అర్జున్‌ని ఎట్టి పరిస్థితుల్లోనైనా జైలుకు పంపించాలని శతవిధాలా ప్రయత్నించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌. షారుక్ ఖాన్‌ కేసులో గతంలో ఓ సినిమా ప్రమోషన్‌ కోసం ఆయన రైలులో ప్రయాణించగా రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మరణించగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును గుజరాత్ హైకోర్టు కొట్టివేసినట్లు హైకోర్టులో నిరంజన్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. అయితే.. తన వాదనలతో హైకోర్టును మధ్యంతర బెయిల్‌కు ఒప్పించిన నిరంజన్ రెడ్డి కృషి ఎనలేనిదని బన్నీ మద్దతుదారులు తెలిపారు. కొసమెరుపు ఏంటంటే.. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 35 మంది చనిపోయిన ఘటనలో చంద్రబాబుపై కూడా కేసు వేసింది నిరంజన్‌రెడ్డే కావడం గమనార్హం. వైసీపీ ఎంపీగా కూడా నిరంజన్‌రెడ్డి కొనసాగుతున్నారు. కానీ నిరంజన్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా వాసి కావడం విశేషం.

ehatv

ehatv

Next Story