Service Voters : సర్వీసు ఓటర్లంటే ఎవరు? వారు ఎలా ఓటేయ్యాలి?
తెలంగాణ ఎన్నికలకు(Telangana Elections) ముహూర్తం ఖరారు కావడంతో రాజకీయ వేడి అమాంతం పెరిగింది. నేతలలో ఎంత ఉత్సాహం ఉందో, కొత్త ఓటర్లు అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. కొత్తగా ఓటు(Vote) హక్కు వచ్చింది సరే... ఓటు గురించి కొన్ని సంగతులు తెలుసుకుంటే బాగుటుంది కదా! అలాంటి వారి కోసం కొన్ని విషయాలు.. సర్వీసు ఓటర్లు(Services Voters) అని అంటుంటారు కదా! ఎవరు వారు అన్న అనుమానం వచ్చే ఉంటుంది...
తెలంగాణ ఎన్నికలకు(Telangana Elections) ముహూర్తం ఖరారు కావడంతో రాజకీయ వేడి అమాంతం పెరిగింది. నేతలలో ఎంత ఉత్సాహం ఉందో, కొత్త ఓటర్లు అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. కొత్తగా ఓటు(Vote) హక్కు వచ్చింది సరే... ఓటు గురించి కొన్ని సంగతులు తెలుసుకుంటే బాగుటుంది కదా! అలాంటి వారి కోసం కొన్ని విషయాలు.. సర్వీసు ఓటర్లు(Services Voters) అని అంటుంటారు కదా! ఎవరు వారు అన్న అనుమానం వచ్చే ఉంటుంది... అస్సామ్ రైఫిల్స్(Assam Rifles) , సీఆర్‌పీఎఫ్(CRPF), బీఎస్‌ఎఫ్(BSF), ఐటీబీఎఫ్(ITBF), బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లోని జీఆర్‌ఈఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు, విదేశాలలో నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న రాష్ట్రాల సాయుధ బలగాలను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు.
వీరు తాము పని చేసే చోటు నుంచే పోస్టల్ ద్వారా ఓటు వేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు ఫారం 2/2 A, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫారం-3 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదువు కోసమో, ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో విదేశాలకు(NRI) వెళ్లిన వారికి అక్కడి నుంచే వారి పాస్‌పోర్ట్‌లో(Passport) సూచించిన చిరునామా అధారంగా సంబంధిత నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే వీరికి విదేశీ పౌరసత్వం ఉండకూడదు. వీరిని ప్రవాస భారతీయ ఓటర్లని అంటారు.
వీరు ఫారం-6ఏ(Form6-A) దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కేవలం సాధారణ ఓటర్ల నమోదుకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవాస భారతీయ ఓటర్ల నమోదుకు వచ్చే దరఖాస్తులను ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్‌లో ఉంచుతారు. తర్వాతి ఎన్నికలలో విదేశాల నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక పనుల మీద వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారు పోలింగ్ నాటికి స్వస్థలానికి వచ్చి ఉండాలి. మనం చెన్నైలో ఉంటూ హైదరాబాద్‌లో ఓటేస్తామంటే కుదరదు. జైలులో బందీగా ఉన్న ఖైదీకి ఓటు వేసే ఛాన్సు ఉండదు. వారు ఓటేయడానికి వీలులేదు.