తెలుగు సినీ ఇండస్ట్రీ (Film Industry)లో ప్రముఖ నిర్మాతగా, నటుడిగా, హాస్యనటుడిగా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బండ్ల గణేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. నిత్యం వివాదాల్లో బండ్ల నానుతూనే ఉంటాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవకపోతే 7 ఓ క్లాక్‌ (7 'O Clock') బ్లేడ్‌తో తన గొంతుకోసుకుంటానని మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి కావడంతో సోషల్‌మీడియాలో అతనిపై మామూలు ట్రోల్స్‌ నడవలేదు. గత ఐదేళ్లుగా ఎప్పుడూ ఏదో విషయంలో ట్రోల్‌ (Troll) అవుతూనే వచ్చాడు.

ఆ ఎన్నికల తర్వాత బండ్ల గణేష్ సెలైంట్ అయ్యారు. తాను వ్యాపారం (Buisiness), సినిమాలు తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని ప్రకటించుకున్నాడు. ఇకపై తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని చెప్పారు. కానీ గత కొంత కాలంగా పాలిటిక్స్‌పై బండ్లకు మనసు పడినట్లుంది. మెల్లగా రాజకీయాలవైపు మళ్లాడు. తాను తొలి నుంచీ కాంగ్రెస్‌వాదినని చెప్పుకునే బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు మద్దతు పలికాడు. ట్విట్టర్‌ ద్వారా కాంగ్రెస్‌కు మద్దతుగా పోస్టులు పెడుతూ వచ్చాడు. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లోనూ బండ్ల హడావిడి మామూలుగా లేదు. డిసెంబర్ 9న కాంగ్రెస్‌ సీఎం (CM) ప్రమాణస్వీకారం ఉంటుందని.. తాను ఏడో తేదీ నుంచే అక్కడే వెళ్లి పడుకుంటానని వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచాడు. చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతుగా హైదరాబాద్‌లో చేసిన పలు ఆందోళనల్లోనూ పాల్గొన్నాడు.

తాను అనుకున్న విధంగానే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ (Revanth) ప్రమాణస్వీకారం రోజు కూడా ఎల్బీస్టేడియంలో (LB Stadium) బండ్ల గణేష్ హంగామా చేశాడు. రేవంత్‌ అన్న జిందాబాద్‌ అంటూ నినదించాడు. కేసీఆర్‌ను (KCR)పరామర్శించిన రేవంత్‌కు పాదాభివందనాలంటూ ట్వీట్ చేశాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.. బండ్ల గణేష్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లభించే పదవి ఏంటనే చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ఏపీలో పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) ఫిలిం డెవలప్‌మెంట్ (Film Development) కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా చేసే అవకాశముందా అన్న చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీ కోసం బండ్ల గణేష్‌ సేవలు వాడుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో నెటిజిన్.. బండ్లకు ఏ పదవి ఇచ్చినా కామెడీ (Comedy) మిస్‌ కాదు సుమా.. అంటూ ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు. బండ్ల గణేష్‌ను ఎలాంటి పదవి వరిస్తుందో చూడాలి.

Updated On 14 Dec 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story