మొదట కోయ గిరిజనులైన(Tribes) చందా వంశీయుల ద్వారా 1940-50ల మధ్య బయ్యక్క పేటలో ఆరంభమైన సమ్మక్క(Samakka), సారలమ్మ(Saralamma) జాతర ప్రస్తుతం మేడారంలోని(Medaram) జంపన్నవాగు సమీపంలో(Jampanna vagu) జరుగుతోంది. ఇప్పుడు ఈ జాతర వివిధ తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ వనదేవతలను మొదట తెలంగాణ ప్రాంత కోయ గిరిజనులు మాత్రమే కొలిచేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలవారు కూడా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర నుండి గోండులు, మధ్యప్రదేశ్ నుండి కోయలు, బీర్స్, రఫిస్తార్ గోండులు ఒడిషా నుండి సవర గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని ఆదివాసీ తెగల గిరిజనులు జాతరకు వస్తున్నారు.

మొదట కోయ గిరిజనులైన(Tribes) చందా వంశీయుల ద్వారా 1940-50ల మధ్య బయ్యక్క పేటలో ఆరంభమైన సమ్మక్క(Samakka), సారలమ్మ(Saralamma) జాతర ప్రస్తుతం మేడారంలోని(Medaram) జంపన్నవాగు సమీపంలో(Jampanna vagu) జరుగుతోంది. ఇప్పుడు ఈ జాతర వివిధ తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ వనదేవతలను మొదట తెలంగాణ ప్రాంత కోయ గిరిజనులు మాత్రమే కొలిచేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలవారు కూడా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర నుండి గోండులు, మధ్యప్రదేశ్ నుండి కోయలు, బీర్స్, రఫిస్తార్ గోండులు ఒడిషా నుండి సవర గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని ఆదివాసీ తెగల గిరిజనులు జాతరకు వస్తున్నారు. వనదేవతల పూజారులు గోత్రాల వారీగా మొత్తం 14 మంది వారసత్వంగా జాతర నిర్వహిస్తున్నారు. మాఘమాసంలో పున్నెమి వస్తుందనగానే ఆదివాసీల సంస్కృతిలో వెన్నెల వెలుగులు తెస్తుందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల మనసులు భక్తిభావంతో పొంగిపోతాయి.

అయితే సమ్మక్కసారలమ్మల జాతర ఎప్పుడు ప్రారంభమైందనేది ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. అసలు జాతర ఎప్పుడు మొదలైంది.? ఎక్కడ మొదలైంది..? అన్నవి ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు. జాతర మొదలైంది ఐలాపూర్(Ilapur) లో! అక్కడి నుంచి బయ్యక్కపేట ఆ తర్వాత మేడారం వచ్చి స్థిరపడింది. 1932కు పూర్వం మేడారంలో ఒక్క సమ్మక్క గద్దె ఉండేది. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి మరో గద్దెను ప్రతిష్టించి పూజించారు. 1974లో పగిడిద్దరాజు, 1988లో గోవిందరాజుల గద్దెలు కూడా రావడంతో జాతరలో నలుగురు దేవతలు పూజలందుకుంటున్నారు. ఒకప్పుడు తమ కోయగూడెంలో సమ్మక్కను పూజించాలంటే , ఈ నాలుగు రోజుల జాతర జరపాలంటే కావలసిన సరంజామా సమకూర్చుకోవడానికి కోయపెద్దలు ఇతర గూడేల్లో జోలెపట్టేది. ఆనాడు సమ్మక్క ఆదివాసీల ఆరాధ్యదైవం. క్రమక్రమేణా ఆదివాసీలు ఎక్కడ ఉన్నా ఈ జాతరకు తరలిరావడం, తమ దైవాన్ని కొలిచివెళ్లడం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గిరిజనేతరులు కూడా ఇక్కడేముందో చూద్దామని వచ్చి తమ మొక్కులు తీరితే వచ్చేసారి వస్తామంటూ మొక్కుకుంటున్న జనం చెప్పినట్టుగా మళ్లీ మళ్లీ వస్తున్నారు.. ఆనోటా ఈనోటా ఖండాంతరాలు దాటిన సమ్మక్క జాతర ఖ్యాతి నేడు కోటి మంది భక్తకోటిని జాతర దరిచేరుస్తోంది.

మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్టిస్తారు. ఇక రెండో రోజు సమ్మక్క ప్రతిష్ట కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తారు. అత్యంత రహస్యంగా పూజలు చేశాక జై సమ్మక్క జైజై సమ్మక్క అన్న భక్తుల నినాదాల మధ్య ప్రధాన అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది..
రెండేళ్లకోసారి సమ్మక్క పండుగ జరుగుతుంటుంది. జాతర జరిగే సంవత్సరంలో గిరిజనులకు ఏడాది పొడుగునా సమ్మక్కధ్యాసే ఉంటుంది. సంవత్సరమంతా దేవతను కొలుస్తూ అడవిలో లభ్యమయ్యే వస్తువులను, వారు చేసే పనులను కార్తెల ప్రకారం అత్యంత వైభవంగా పండుగలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. వర్షాకాలం మొదలు విత్తనాలు పెట్టే సమయంలో సూరాల పండుగ చేసుకుంటారు. ఈ పండుగ రోజు ఇప్పపూలను నిండు చెంబులో వేస్తారు. వేట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం విత్తనాలలో కలిపి పంట వేస్తారు. ఆ తర్వాత మాఘకార్తె పొట్టపండుగ చేసుకుంటారు.

కొత్త ధాన్యం తెచ్చి అమ్మవారి ముందు మొక్కుగా సమర్పించి ఆ తర్వాత కులపెద్దలు తింటారు. అటు తర్వాత ఉత్తర కార్తెలో అమ్మవారికి కోడిపుంజులు సమర్పించుకుంటారు. దేవుని చేసుకుని పెద్దలకు పండుగ చేసుకుంటారు. అటు పిమ్మట చిక్కుడుకాయకోత పండుగ. అడవిలో లభ్యమయ్యే చీపురు, గడ్డి, చిక్కుడుకాయలు అమ్మవారికి నైవేద్యం పెడతారు.. అనంతరం వాటిని గిరిజనులు ఉపయోగించుకుంటారు. అటు నుంచి మండమెలిగే పండుగ. ఇది జాతర పండుగ. వేట అమ్మవారికి సమర్పించి అందరూ సమ్మక్కను కొలుచుకుంటారు. చివరగా ఇప్పపూవు పండుగ దీనినే కోలుకడితే పండుగ అంటారు. ఇప్పపూవు పుష్పించే సమయంలో ఈ పండుగ చేసి ఆ తర్వాతే ఇప్పపూవు ఏరుతారు. ఆధునిక కాలంలోనూ ఈ ఆచారవ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయి. సమ్మక్క జాతర ఏడాది పొడుగునా ఈ పండుగలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
మేడారం జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల దగ్గర జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు. ఇలా చెప్పుకుంటూ పోతే జాతరలో ప్రతి ఒక్కటీ అద్భుతమే. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క జాతర జరగాలని ఎప్పటినుంచో సంప్రదాయం ఉంది.

పున్నమ వెలుగుల్లో గిరిదేవతల కాంతులు వికసిస్తాయి. ఇక సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన దగ్గరకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు.
సమ్మక్క కుంకుమభరిణె ఉండే ప్రాంతం చిలుకలగుట్ట. అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. మరోవైపు చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్తరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకొనిరావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు.
జాతరలో అత్యంత ముఖ్యమైనది మూడోరోజే. ఆ ఒక్క రోజే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుంటారు. మొక్కుబడులు, ఎదురుకోళ్లు, పొర్లుదండాలు, జంతుబలులు, శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది. జాతరకు వచ్చే భక్తులు తమ ఇలవేల్పులను వారి వారి పద్ధుతుల్లో కొలుస్తుంటారు. తమ ఈతిబాధలు తీర్చాలంటూ వనదేవతలను ఒక్కొక్కరు. ఒక్కో పూజావిధానంతో వేడుకుంటారు.

Updated On 17 Feb 2024 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story