తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఆరు (Six) గ్యారెంటీలతో పాటు ఎన్నో హామీలు ఇచ్చింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ మరెన్నో హామీలను తన మేనిఫెస్టో (Manifesto)లో పొందు పర్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun kharge) చేతుల మీదుగా నవంబర్ 17న గాంధీభవన్‌లో మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 (42 Pages) పేజీలు.. 66 (Sixty six) హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు.

కల్యాణమస్తు (KalyanaMasthu) పథకంలో భాగంగా ఆడ పిల్లలు (Girls) పెళ్లి (Marriage) చేసుకుంటే లక్ష రూపాయలతో (One Lakh) పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళలు ఇప్పుడు ఈ హామీపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి వారం రోజులే కావస్తోంది. 100 రోజుల సమయంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత ప్రయాణం (Free Journey), ఆరోగ్య శ్రీ (Arogya Sri) వర్తింపు రూ.10 లక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కల్యాణమస్తు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. వచ్చే బడ్జెట్ నుంచి ఇది అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అప్పటిలోగా దీనిపై మార్గదర్శకాలు రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ( Eighteen Years)ఏళ్లు దాటిన యువతులకు స్కూటీ, ల్యాప్‌టాప్ (Laptop) కొనిస్తామని కాంగ్రెస్ కీలక హామీలు ఇచ్చింది. యూత్ (Youth)ను ఆకట్టుకునేందుకు ఈ హామీ ఇచ్చింది. అయితే దీనిపై కూడా ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదు. ఇన్ని హామీలను ప్రభుత్వం ఎలా అమలు పరుస్తుందో చూడాలంటున్నరు ఆర్థిక నిపుణులు. ఇలా కాంగ్రెస్ హామీలు అమలకు దాదాపు ఏడాదికి అదనంగా లక్ష కోట్లకుపైగా (One Lakh Crore) నిధులు అవసరమవుతాయని.. ఈ నిధుల సమీకరణే పెద్ద సవాల్‌గా మారనుందని వారు విశ్లేషిస్తున్నారు.