తెలంగాణలో(Telangana) సంతోషమైనా, దుఖఃమైనా ముక్క ఉండాల్సిందేనని మరోసారి నిరూపణ జరిగింది. ఎవరన్నా దావత్‌ చేస్తున్నడంటే ఆడ.. ఏమేం పెడుతున్నరు.. ముక్క ఉందా.. సుక్క ఉందా.. అని ఆరా తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం(Balagam) సినిమాలో నల్లి బొక్క కోసం ఎంత రచ్చయిందో కూడా కళ్లకు కట్టినట్లు మనకు చూపించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. దేశంలోనే తెలంగాణలో అధికంగా మాంసం వినియోగం పెరిగిందట.

తెలంగాణలో(Telangana) సంతోషమైనా, దుఖఃమైనా ముక్క ఉండాల్సిందేనని మరోసారి నిరూపణ జరిగింది. ఎవరన్నా దావత్‌ చేస్తున్నడంటే ఆడ.. ఏమేం పెడుతున్నరు.. ముక్క ఉందా.. సుక్క ఉందా.. అని ఆరా తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం(Balagam) సినిమాలో నల్లి బొక్క కోసం ఎంత రచ్చయిందో కూడా కళ్లకు కట్టినట్లు మనకు చూపించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. దేశంలోనే తెలంగాణలో అధికంగా మాంసం వినియోగం పెరిగిందట. జాతీయ సగటుకన్నా ఎక్కువగా మాంసాన్ని మన తెలంగాణ ముద్దుబిడ్డలు లాంగించేస్తున్నారని నివేదికలు చెప్పుకొచ్చాయి.

70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని(Non-Veg) ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. మన దేశంలో 16.6శాతం మంది మగవారు, 29.4 శాతం మంది ఆడవారు తప్ప, మిగిలిన వారంతా మాంసం ప్రియులేనని ఈ సర్వేలో తేలింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మాంసం తినేవారేనని తేల్చింది. అయితే దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రభాగాన ఉండగా తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్‌ 98.55, ఏపీ 98.25 శాతంతో వరుసగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కిలో మాంసం ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండగా, మన దగ్గర రూ. 800 నుంచి రూ.1,000 వరకూ ఉంది. తెలంగాణవాసులు వారానికి కనీసం మూడుసార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతీ వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.58,000 మాంసం కోసం ఖర్చు పెడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు.

తెలంగాణలో 2014–15లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 12.95 కిలోల మాంసం తినగా, అది 2021–22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. జాతీయ సగటు మాత్రం మాంసం వినియోగం దాదాపుగా 7.1 కిలోలు పైచిలుకు ఉంది. తెలంగాణలో మాంసం ప్రియులు సగటున తినే 28 కిలోల్లో దాదాపు 8 కిలోలు గొర్రె లేదా మేక మాంసం కాగా.. ఇందులో కొద్దిగా బీఫ్, పంది మాంసం కూడా ఉంది. ఇక మిగిలింది చికెన్‌. అంతేకాకుండా రాష్ట్రంలో ఉత్పత్తి, దిగుమతి అయ్యే మాంసంలో సింహభాగం హైదరాబాద్‌లోనే ఉపయోగిస్తున్నారు. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిల్వ చేసి తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయడంతో మాంసం వినియోగానికి హైదరాబాద్‌ మూల కారణమైంది. హైదరాబాద్‌లో రోజు 18 వేల మేక లేదా గొర్రెలను వధిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో కబేళాలు ఉన్నాయి. లోకల్‌గా ఉపయోగించే, ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్కరోజులో 6 వేల నుంచి 7 వేల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45వేల నుంచి 50వేల దాకా జంతువులను వధిస్తున్నట్లు తెలుస్తోంది.

గొర్రెల ఉత్పత్తిలో తొలిస్థానంలో తెలంగాణ ఉండగా, మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. తెలంగాణలో మాంసం వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. డిమాండ్‌ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె/మేక ద్వారా వస్తున్న మాంసం ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం మేక లేదా గొర్రెలను విరివిగా పెంచేందుకు కృషి చేస్తున్నారు

Updated On 11 Jun 2024 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story