ఆదిలాబాద్‌ జిల్లాలో(Adilabad District) గ్రామపెద్దలు హడలిపోతున్నారు. ఎక్కడ తమ కంటి చూపు పోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. కారణమేమిటో తెలియదు కానీ పది రోజుల వ్యవధిలోనే డోంగర్‌గామ్‌(Dongargam) గ్రామపెద్దలు మడావి దేవ్‌రావ్‌, గ్రామపటేల్ పెందోర్‌ బాదుపటేల్‌ కంటిచూపు పోయింది. పది రోజుల కిందట గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు కంటిచూపు కోల్పోయాడు.

ఆదిలాబాద్‌ జిల్లాలో(Adilabad District) గ్రామపెద్దలు హడలిపోతున్నారు. ఎక్కడ తమ కంటి చూపు పోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. కారణమేమిటో తెలియదు కానీ పది రోజుల వ్యవధిలోనే డోంగర్‌గామ్‌(Dongargam) గ్రామపెద్దలు మడావి దేవ్‌రావ్‌, గ్రామపటేల్ పెందోర్‌ బాదుపటేల్‌ కంటిచూపు పోయింది. పది రోజుల కిందట గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు కంటిచూపు కోల్పోయాడు. వెంటనే ఆయన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఎల్.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేయించారు. అయినా కంటిచూపు మాత్రం రాలేదు. నాలుగు రోజుల కిందట నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ కూడా చేయించారు. అయినా కంటిచూపు రాలేదు. బుధవారం రాత్రి గ్రామపెద్ద, గ్రామపటేల్‌ పెందోర్‌ బాదుపటేల్‌ కంటిచూపు పోయింది. 40 రోజుల కిందట ఓ ప్రజా ప్రతినిధి డోంగర్‌గామ్‌ గ్రామాన్ని సందర్శించాడు. గ్రామ పొలమేరలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి బంగారు కళ్లు చేయిస్తానని చెప్పి అప్పటికే ఉన్న వెండి కళ్లను తీసుకెళ్లాడు. బంగారు కళ్లు చేయిస్తానని చెప్పిన ప్రజాప్రతినిధి ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదట! ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందట! అందుకే గ్రామ పెద్దలు వరుసగా చూపు కోల్పోతున్నారని గ్రామస్థులు భయంభయంగా చెబుతున్నారు. ఆంజనేయస్వామి ఆగ్రహం చెందడం వల్లే కంటిచూపు పోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కంటిచూపు కోల్పోతున్న వారిని పరీక్షించి చూపు వచ్చేలా చేయాలన కోరుతున్నారు.

Updated On 11 Aug 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story