పూరీ జగన్నాథ్‌(Puri jagannath)-కేసీఆర్‌(KCR) తాజాగా మరో వివాదం మొదలైంది.

పూరీ జగన్నాథ్‌(Puri jagannath)-కేసీఆర్‌(KCR) తాజాగా మరో వివాదం మొదలైంది. గతంలోనూ ఓ సారి ఇలాంటి వివాదంలోనే పూరీ జగన్నాథ్‌ చిక్కుకున్నారు. తెలంగాణ ఏర్పాటుపై పూరీ జగన్నాథ్‌కు ఎందుకు అంత అక్కసు అని బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు, కేసీఆర్‌ అభిమానులు మండి పడతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో కూడా పూరీ జగన్నాథ్‌పై తెలంగాణపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడని అంటున్నారు. 2012లో

కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman ganga tho rambabu) సినిమాలో రాజకీయ నాయకుడికి, రిపోర్టర్‌కు మధ్య జరిగే కథ అని చెప్పి సినిమాను విడుదల చేశారు. తీరా విడుదలైన తర్వాత అది తెలంగాణ ఉద్యమం మీద కక్కిన విషమని తేలండంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై, ఉద్యమంపై తనకున్న విషాన్ని వెళ్లగక్కాడని సినిమా ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమాపై నిరసనలు వెల్లువెత్తడంతో అన్ని కేంద్రాల్లో ప్రదర్శన నిలిచిపోవడంతో ఈ సినిమా డిజాస్టరయింది.

తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అయింది, రెండు రాష్ట్రాలు ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. అయినా పూరీ జగన్నాథ్‌ వైఖరిలో మార్పు రాలేదని, 10 ఏళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. పదేళ్లు కుక్కిన పేనులా పడి ఉన్న ఇలాంటి వారు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోగానే మరోసారి తెలంగాణ గడ్డపై విషం చిమ్మే పరిస్థితికి వచ్చారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణను కించపరిచేలా తన చిత్రాల్లో చూపిన పూరీ, తాజాగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో మరోసారి తన పైత్యాన్ని చాటుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలోని 'మార్‌ ముంత చోడ్‌ చింత' పాటను మంగళవారం సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పాట విన్న తెలంగాణవాదులు, కేసీఆర్‌ అభిమానులు ఒక్కసారిగా మండి పడ్డారు. పార్టీ పాట పేరుతో విడుదల చేసిన కల్లు కాంపౌండ్‌ సినిమాలో హీరో రామ్, కావ్యా థాపర్‌ కల్లు బాటిళ్లు పట్టుకొని డ్యాన్సులు చేస్తారు.

కేసీఆర్‌ అభిమానుల అభ్యంతరం ఏంటంటే ఈ సినిమాలో కేసీఆర్‌ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన మాటను ఉపయోగించడమే. తెలంగాణ సాధకుల్లో ముందున్న వ్యక్తి, పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్‌ పట్ల ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తారా అని మండిపడుతున్నారు. తెలంగాణ అంటేనే మందుకొట్టుడే అనే వ్యంగ్య భావన కలిగించేలా చిత్రీకరించిన ఈ పాటలో ఓ మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్‌ మరీ..’ అనే డైలాగ్‌ను వాడి తన పైత్యాన్ని ప్రదర్శించాడు పూరీ జగన్నాథ్. పాట విడుదలైన గంటల్లోనే ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో తెలంగాణవాదులు, ఇటు కేసీఆర్ ఫ్యాన్స్‌ పూరీ జగన్నాథ్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ పాటలో కేసీఆర్‌ ‘హుక్‌లైన్‌’ను దురుద్దేశపూర్వకంగానే పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు గీత రచయిత కాసర్ల శ్యామ్‌పై కూడా సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం వాసిగా ఉన్నకాసర్ల శ్యాం అలాంటి హుక్‌లైన్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. కాసర్ల శ్యామ్‌తోపాటు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా తెలంగాణ వాడే కావడం గమనార్హం.

అయితే కాసర్ల శ్యాం రాసినా, రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul spiliganj) పాడినా పాటపై అంతిమ నిర్ణయం దర్శకుడు పూరీదే ఉంటుందని, మరోసారి పూరీ తనకున్న ఏహ్యభావాన్ని వెళ్ల గక్కాడని అంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష, యాస కేంద్రంగా ఎన్నో హిట్‌ సినిమాలు వచ్చాయి, ఎందరో నిష్ణాతులు తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. ఒకప్పుడు తెలంగాణ భాష, యాసను కించపర్చేలా విలన్లకు మాత్రమే ఈ భాషను వాడేవారు, ఆనాడు ఆంధ్రా పెత్తనంలో ఉన్న నిర్మాతలు, దర్శకులు తెలంగాణ భాషపై అక్కసు వెళ్లేగక్కేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాసనే హీరోలకు, హీరోయిన్లకు వాడుతూ హిట్లు కొట్టారని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా దిగిపోగానే తెలంగాణ అంటే తాగుబోతుల రాష్ట్రంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే కల్లు డిపోలో పాడే పాటకు కేసీఆర్‌ వాడిన మాటను హుక్‌లైన్‌గా పెట్టి మరోసారి పైశాచిక ఆనందం పొందుతున్నాడని పూరీ జగన్నాథ్‌పై కేసీఆర్‌ అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story