బల్కంపేట ఎల్లంపేట(Balkampe yellamma) కల్యాణోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి(Cm revanth reddy) జోగినిలు(Jogini) శాపనార్థాలు పెట్టారు.
బల్కంపేట ఎల్లంపేట(Balkampe yellamma) కల్యాణోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి(Cm revanth reddy) జోగినిలు(Jogini) శాపనార్థాలు పెట్టారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు సర్వనాశనం అవుతాయని శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగినీలు, పోతురాజుల పట్ల పోలీసులు దురుసువైఖరిని అవలంబించారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా తమదైన శైలిలో రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రెస్ క్లబ్‌లో(Press club) ప్రెస్‌మీట్ పెట్టి మరీ రేవంత్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.
తెలంగాణలో ప్రభుత్వం సరిగా లేదు. పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారు. ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం రథోత్సవం లాగా లేదు. అంగరంగ వైభవంగా జరగాల్సిన రథోత్సవం డప్పులు, మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లాలి. కానీ డప్పుమేళాలు లేకుండా కల్యాణోత్సవం జరపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. గుడి ఈవో ఏం చేస్తున్నాడు. అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు.. డప్పు లేదు. ఒక భాజా లేదు. అమ్మవారిని మనసుతో మొక్కండి. మేం మనసుతో వస్తాం. నియమనిష్టలతో ఒక్క పొద్దు ఉండి బోనాలు చేస్తాం. ఇక్కడికి వచ్చామన్న ఒక ఆనందం లేదు. ఎల్లమ్మ రథోత్సవం నిర్వహణలో కాంగ్రెస్(congress) ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని జోగినిలు పేర్కొన్నారు. సీఎం డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ జోగినిలు నినాదాలు చేశారు. అంతేకాకుండా గత కేసీఆర్(KCR) ప్రభుత్వమే బాగుందని, కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు కూడా చేశారు.