రాజకీయ పార్టీలకేంది? ఎవరైనా పెట్టొచ్చు. ఆ పార్టీని సజావుగా నడిపించగలగే వ్యక్తులే నాయకులుగా ఎదుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలు తమలో ఉన్నాయో లేవో ఆత్మపరిశీలన చేసుకోకుండానే పార్టీలు పెట్టేస్తారు. ఏడాది తిరక్కుండానే చాప చుట్టేస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తామరతంపరగా పార్టీలు వెలిశాయి. ఎన్నికల వేళ పుట్టుకొచ్చిన పార్టీలు మళ్లీ కనిపించకుండా పోయాయి.

రాజకీయ పార్టీలకేంది? ఎవరైనా పెట్టొచ్చు. ఆ పార్టీని సజావుగా నడిపించగలగే వ్యక్తులే నాయకులుగా ఎదుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలు తమలో ఉన్నాయో లేవో ఆత్మపరిశీలన చేసుకోకుండానే పార్టీలు పెట్టేస్తారు. ఏడాది తిరక్కుండానే చాప చుట్టేస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తామరతంపరగా పార్టీలు వెలిశాయి. ఎన్నికల వేళ పుట్టుకొచ్చిన పార్టీలు మళ్లీ కనిపించకుండా పోయాయి. ఇప్పుడు వై.ఎస్.షర్మిల(YS Sharmila) స్థాపించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) కూడా అంతే! ఆమె చేసిన మొట్టమొదటి తప్పు తన రాజకీయ క్షేత్రంగా తెలంగాణను ఎంచుకోవమే! తెలంగాణ రాకముందు ఓ లెక్క. తెలంగాణ వచ్చిన తర్వాత ఓ లెక్క అన్న సంగతి బహుశా ఆమెకు తెలియకపోవచ్చు. తన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. తెలంగాణ కోడలినని చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని కూడా తెలుసు. అయినా తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకున్నారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో జరిపించిన సర్వేలో వైఎస్‌ఆర్‌టీపీకి 70కి పైగా స్థానాలు వస్తాయని తేలిందని టముకేసుకున్నారు.

మొదటి నుంచి షర్మిల పార్టీకి పెద్ద ప్రయారిటీ ఇచ్చిన ఓ మీడియా కూడా ఈ సర్వే ఫలితాలను ప్రముఖంగా ప్రచురించింది. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని ఆమె పసిగట్టలేకపోయింది. తెలంగాణ సెంటిమెంట్‌ ఇంకా ప్రజల్లో పచ్చిగానే ఉందన్న సంగతిని కూడా ఆమె గుర్తించలేకపోయింది. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అనే ముద్ర వేసుకున్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) పాలన మళ్లీ తెస్తానంటే తెచ్చుకునేంత అమాయక ప్రజలు కాదు తెలంగాణ వాసులన్నది నెమ్మదిగా ఆమెకు తెలిసి వచ్చింది. తెలంగాణ అంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగినా, పాదయాత్రకు నిర్వచనం చెప్పి ఊరూవాడా చుట్టేసినా తన పార్టీ పార్టీకి భవిష్యత్తు లేదని ఆమెకు ఆలస్యంగా అవగతమయ్యింది. ఇక తప్పని పరిస్థితులలో గుండెను రాయి చేసుకుని కాంగ్రెస్‌లో(Congress) తన పార్టీని విలీనం చేయాలనుకున్నారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. అదీ వర్క్‌ అవుట్‌ కాలేదు. తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడటంతో ఆవేశం వచ్చేసిందామెకు. ఆ ఆవేశంతోనే తెలంగాణలోని 119 స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించారు. తనతో పాటు తల్లి విజయలక్ష్మి(Vijaya laxmi), భర్త అనిల్‌కుమార్‌(Anil Kumar) కూడా పోటీ చేస్తారని మీడియాకు చెప్పారు. షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడితే షర్మిల మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై చిన్నపాటి కసరత్తు కూడా చేసిన దాఖలాలు కనిపించలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌(Notification) విడుదలైంది. నామినేషన్ల(Nomination) ప్రక్రియ కూడా మొదలయ్యింది. సరిగ్గా అప్పుడు మీడియా ముందుకొచ్చారు షర్మిల. ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగించవద్దనే కారణంతోనే తన పార్టీ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోందని తెలిపారు. రాజకీయాలలో విజయం సాధించాలంటే ఆవేశం ఒక్కటే సరిపోదు! దాంతో పాటు ఆలోచన ఉండాలి!

Updated On 3 Nov 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story