తెలంగాణలో పరిశ్రమలపై అసెంబ్లీలో(TS Assembly) చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేటీఆర్‌(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో పరిశ్రమలపై అసెంబ్లీలో(TS Assembly) చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా కేటీఆర్‌(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్‌ వెళ్లి వచ్చి 40 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని కానీ అదంతా డొల్ల అని ఆయన ఘాటుగా స్పందించారు. గోడీ ఇండియా(Godi India) అనే కంపెనీ ఆన్యువల్ రిపోర్టులో రూ. 27 లక్షల లాస్ లో ఉన్నట్లు చూపిస్తుంటే.. అలాంటి కంపెనీ రూ. 8 వేల కోట్ల పెట్టుబడి పెడతుందని రేవంత్ ఒప్పందం కుదుర్చుకుని, మేం రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని పొంకనాలు కొట్టారని కేటీఆర్‌ విమర్శించారు. లాస్‌లో న్న కంపెనీ అన్ని వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని ఏ రకంగా కరెక్టని అన్నారు. మీమ్మల్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పరోక్షంగా జయేష్‌ రంజన్‌ను(Jayesh Ranjan) విమర్శించినట్లు తెలుస్తోంది. మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలవకపోవచ్చు కానీ మీ అధికారులకేమైందని కేటీఆర్‌ పరోక్షంగా జయేష్‌ రంజన్‌ను అనడంతో ఇద్దరికీ ఎక్కడ చెడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 22 ఏప్రిల్ 2022 జేఎస్‌డబ్ల్యూ న్యూఎనర్జీ అనే జిందాల్ స్టీల్ కంపెనీ 1500 మెగావాట్ల కెపాసిటీతో 9 వేల 500 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తమ ట్వీట్‌లో పెట్టారు. ఆ ఫొటోలో జయేష్‌ రంజన్‌ కూడా ఉన్నారన్నారు. 40 వేల కోట్ల పెట్టుబడిలో 8 వేల కోట్లు గోడీ ఇండియా అనేది బోగస్ పెట్టుబడి అయితే, మరో 9,500 JSW కంపెనీ పెట్టుబడి మా హయాంలోనే వచ్చిందని 17 వేల కోట్లు పెట్టుబడి పోతే.. మిగిలింది ఆదాని కంపెనీలకు కట్టబెట్టారన్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్‌ జయేష్‌ రంజన్‌ టార్గెట్‌గా విమర్శించారని వార్తలు వచ్చాయి.

గత పదేళ్లుగా జయేష్‌ రంజన్‌ కేటీఆర్‌ వెంటే జయేష్‌ రంజన్‌ ఉన్నారు. కేటీఆర్‌ విదేశీ పర్యటనలు ఆసాంతం జయేష్ రంజన్‌ దగ్గర ఉండి చూసుకునేవారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో కేటీఆర్‌, జయేష్‌ రంజన్‌ కీలక పాత్రలో ఉన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా జయేష్‌ రంజనే కొనసాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి జయేష్‌ రంజన్‌పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్, జయేష్ రంజన్‌ బాగోతాలన్నీ బయటపెడతామని బహిరంగాగానే మాట్లాడారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వశాఖల అధికారులు మారిపోయారు. కానీ జయేష్ రంజన్‌ను మాత్రం కొనసాగిస్తున్నారంటే అర్థం ఏంటి. కేటీఆర్‌తో జయేష్‌ రంజన్‌కు ఎక్కడ చెడింది, రేవంత్‌తో(CM revanth reddy) ఎక్కడ సఖ్యత కుదిరిందనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే జయేష్ రంజన్‌ను డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకుపోవాలని లోకేష్‌ కూడా భావించారని తెలిసింది. జయేష్‌ రంజన్‌ సమర్థత వల్ల తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయనేది వారి భావన. దీంతోనే జయేష్‌ రంజన్‌ను రేవంత్‌ అట్టిపెట్టుకున్నాడన్న వార్తలయితే వస్తున్నాయి. మొత్తానికి అసెంబ్లీలో కేటీఆర్‌ పరక్షంగా జయేష్ రంజన్‌ను టార్గెట్‌ చేశారనే అంశం చర్చనీయాంశమవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story