వాయు కాలుష్యంలో(Air quality) ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది.?

వాయు కాలుష్యంలో(Air quality) ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది. అయితే వాయు కాలుష్యం ఇప్పుడు హైదరాబాద్‌ను(Hyderabad) కూడా భయపెట్టిస్తోంది. డీజిల్ వాహనాల(Disel vehicles) కారణంగా రోజురోజుకు గాలిలో నాణ్యత తగ్గిపోతోంది. గాలిలో ధూళి కణాలు పెరిగిపోతుంది. ముఖ్యంగా డీజిల్ ఆటోల(Auto) కారణంగా ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్కువైందంటున్నారు. డీజిల్‌ ఆటోలకు బదులు ఎల్పీజీ, సీఎన్జీలు వాడాలని 15 ఏళ్ల కిందటే తెలిపారు. డీజిల్‌ ఆటోలకు బదులుగా సీఎన్జీ, పీఎన్జీ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించొచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన కోకాపేట్, జూపార్కు, శేరిలింగంపల్లి, బాలానగర్, బాచుపల్లి, జీడిమెట్ల, చార్మినార్, ఎంజీబీఎస్‌, ఉప్పల్ ప్రాంతాల్లో సూక్ష్మ ధూళి కణాల స్థాయి అధికంగా ఉందని సర్వేలు వెల్లడించాయి. కోకాపేట్, జూపార్కు, హెచ్‌సీయూ, ఇక్రిశాట్, బొల్లారం వాయు కాలుష్యం 100కుపైగా ఉంటోంది. 101 నుంచి 200 మధ్య ఉంటే ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. 200 -300 మధ్య వాయు కాలుష్యం ఉంటే దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లే వాసనలతో కూడా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అధికారులు అంటున్నారు. కాలుష్యం, ఘాటు వాసనలు, వ్యర్థాల డంపింగ్‌పై 10741కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. కాలుష్య నివారణలో పాలుపంచుకోవాలని సూచిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story