IMD సూచన ప్రకారం ఏప్రిల్ 22, ఏప్రిల్ 23 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన
భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం నాడు తెలంగాణకు హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. ఈ సమయంలో ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి IMD అనేక చర్యలను సిఫార్సు చేసింది. వీటిలో తేలికైన, లేత-రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని కోరింది. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు తలపై గుడ్డ, టోపీ, గొడుగును పట్టుకుని వెళ్లాలని సూచించారు.
IMD సూచన ప్రకారం ఏప్రిల్ 22, ఏప్రిల్ 23 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏప్రిల్ 23 వరకు మధ్యాహ్నాలు లేదా సాయంత్రం వేళల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ వరకు.. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ మరియు 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. నేడు జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.