బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ(Rayalaseema), పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు(Rains in Telangana) పడే అవకాశం ఉందని చెప్పారు.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలుHeavy Rains in Telangana) కురుస్తాయని వాతావరణ కేంద్రం(Meteorological Centre) వెల్లడించింది. వచ్చే మూడు రోజులు వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్ల వాన కురిసే ప్రమాదముందని, ఆ సమయంలో పిడుగులు కూడా పడుతాయని హెచ్చరించింది.

ఈ పరిస్థితుల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌(Yellow Allert) ను జారీ చేసింది. ఆదిలాబాద్‌(Adilabad), కొమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌(Nizamabad), జగిత్యాల(Jagtial), రాజన్నసిరిసిల్ల(Rajanna Sircilla), కరీంనగర్‌(Karimnagar), పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

వర్షం కురిసే సమయంలో చెట్ల కింద కాని, ఆరు బయట బహిరంగ ప్రదేశాల్లో కాని ఉండొద్దని సూచించింది. ఈ రోజు... రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది.

అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వానలు కురుస్తాయని తెలిపింది.

Updated On 24 March 2023 11:21 PM GMT
Ehatv

Ehatv

Next Story