✕
హైదరాబాద్ నగర శివారులో భారీ క్యాసినో నిర్వహించడం కలకలం రేపింది.

x
హైదరాబాద్ నగర శివారులో భారీ క్యాసినో నిర్వహించడం కలకలం రేపింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు

ehatv
Next Story