బీజేపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఉమ్మడి నిజామబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖను పంపారు.

Vinay Kumar Reddy resigns from BJP
బీజేపీ(BJP)కి మరో కీలక నేత రాజీనామా(Resigns) చేశారు. ఉమ్మడి నిజామబాద్(Nizamabad) జిల్లా ఆర్మూర్(Armoor) నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి(Prodduturi Vinay Kumar Reddy) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)కి లేఖను పంపారు. జిల్లాలో అంతర్గత గ్రూపు రాజకీయాలతో విసిగిపోయినట్లు లేఖలో వెల్లడించారు. నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను మోయలేక భారమైన మనసుతో తీవ్ర నిరాశతో రాజీనామా చేస్తున్నానని లేఖలో వెల్లడించారు. 2016 నుంచి తాను పార్టీలో ఎంత కష్టపడ్డది లేఖలో వివరించారు. గత ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP), జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికలలో తన ప్రభావం ఎంతన్నది లేఖలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్(Congress)లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది.
