మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్(Mukesh Goud) కుమారుడు విక్రమ్ గౌడ్(Vikram Goud) బీజేపీ(BJP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)కి పంపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్(Goshamahal) సీటును ఆశించగా.. దక్కలేదు. అప్పటినుంచి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నేడు పార్టీకి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.
పార్టీ లో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆయన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని అధిష్టానం తీరును దుయ్యబట్టారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారని.. ఎన్నికల తర్వాత ఓటమికి, అసంతృప్తులపై ఎవరూ బాధ్యత తీసుకోలేదని పార్టీలో పరిస్థితులను ఎండగట్టారు. అవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని లేఖ పేర్కొన్నారు.