విజయవాడలో(Vijawada) ఆర్టీసీ బస్సు(RTC Bus) బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై దూసుకెళ్లిన బస్సు ముగ్గురు మృతికి కారణమైంది. మృతుల్లో కండక్టర్‌తో(conductor) పాటు ఓ మహిళ, బాలుడు(Child) ఉన్నారు. నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో (Pandit Nehru Busstop)ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.

విజయవాడలో(Vijawada) ఆర్టీసీ బస్సు(RTC Bus) బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై దూసుకెళ్లిన బస్సు ముగ్గురు మృతికి కారణమైంది. మృతుల్లో కండక్టర్‌తో(conductor) పాటు ఓ మహిళ, బాలుడు(Child) ఉన్నారు. నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో (Pandit Nehru Busstop)ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో కండక్టర్‌తో పాటు ఓ మహిళ, బాలుడు ఉన్నారు. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. 12వ నంబర్‌ ప్లాట్‌ఫాం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 11, 12 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఫర్నిచర్‌ ధ్వంసమైంది. బ్రేక్‌ ఫెయిల్‌(Break fail) కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు(Autonagar Dipot) చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. మృతిచెందిన కండక్టర్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారిస్తున్నారు. కాగా ప్రమాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బ్రెక్‌ఫెయిలై ప్రమాదం జరిగిందని కొందరు అంటుంటే.. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని కొందరు చెప్తున్నారు.

Updated On 6 Nov 2023 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story