తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని.. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అధ్యక్ష మార్పుపై ఇప్పటికే పలువురు పార్టీ నేతలు స్పందించారు. అధ్యక్ష మార్పు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష(Telangana BJP Chief) మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. బండి సంజయ్(Bandi Sanjay)ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని.. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అధ్యక్ష మార్పుపై ఇప్పటికే పలువురు పార్టీ నేతలు స్పందించారు. అధ్యక్ష మార్పు ఉండదని స్పష్టం చేశారు. అయితే రూమర్లు మాత్రం ఆగడం లేదు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ ప్రచారానికి కారణమని కొంతమంది అంటుండగా.. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వాళ్ల పని అని కొందరు.. ప్రత్యర్ధి పార్టీలు రాష్ట్రంలో బీజేపీని బలహీన పరిచే కుట్ర అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొంతమంది నేతలు మాత్రం బండి సంజయ్ మార్సును వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత విజయరామారావు(Vijayaramarao) మాట్లాడుతూ.. కేవలం జంట నగరాలకే పరిమితమైన బీజేపీని తెలంగాణలోని పల్లెపల్లెకు తీసుకెళ్లిన ఘనత బండి సంజయ్‌దని అన్నారు. బండి సంజయ్ మార్పు ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు.
మరో నేత విజయశాంతి(Vijayashanti) కూడా ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గత కొన్ని దినాలుగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై వార్తలు నిరంతరం వస్తున్నాయి. కానీ, బండి సంజయ్ మార్పుకు కారణం మాత్రం ఎవ్వరూ వెల్లడించటం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉంటాయని.. అప్పటిదాక రాష్ట్ర అధ్యక్ష మార్పు లేదని ఇంచార్జ్ తరుణ్ ఛుగ్(Tarun Chugh) కూడా ఈ మధ్యనే స్పష్టంగా ప్రకటించారు. ఇంతలోనే మార్పు వార్తలు ఎందుకు అన్నది.. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణమిచ్చి పనిచేసే బీజేపీ కార్యకర్తలకు(BJP Workers) తెలియచెయ్యవలసిన అవసరం.. వార్తలు ప్రచారం చేసే వారికి ఉంది కదా అని అడిగారు.