☰
✕
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహ రూపురేఖలపై బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి.
x
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహ రూపురేఖలపై బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా తీర్చిదిద్దిన విగ్రహమే సరైందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం మూర్ఖత్వమని బీఆర్‌ఎస్ అంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎక్స్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలి హోదాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2007, జనవరి 25వ తేదన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో విజయశాంతి అలియాస్ రాములమ్మ ఆవిష్కరించిన మొట్ట మొదటి తెలంగాణ విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని ఎక్స్‌లో విజయశాంతి చెబుతూ ఫోటోను షేర్ చేసన సహ తెలంగాణ ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు విజయశాంతి.
ehatv
Next Story