తెలంగాణ(Telangana)లో బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) ఇక ఉండదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) ఖండించారు.

తెలంగాణ(Telangana)లో బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) ఇక ఉండదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) ఖండించారు. కిషన్‌రెడ్డి అభిప్రాయం సమంజసం కాదన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని విజయశాంతి అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించేవారు దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, రామకృష్ణ హెగ్డే, జయలలిత దగ్గర నుంచి ఇప్పటి బీఆర్‌ఎస్‌, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ వరకు ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాములమ్మ సూచించారు. ఎన్నడైనా ఇదే వాస్తవమని చెప్పారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావమని విజయశాంతి ట్వీట్‌ చేశారు. చివరగా హరహర మహదేవ్‌ అంటూ జై తెలంగాణ అని ముగించారు. అన్నట్టు విజయశాంతి తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులెవరూ ఇప్పటి వరకు జై తెలంగాణ అనకపోవడం విశేషం!

Updated On 17 May 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story