ఎన్నికల ముందు బీజేపీకి తెలంగాణలో గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ముందు బీజేపీ(BJP)కి తెలంగాణ(Telangana)లో గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్(Bandi Sanjay)ను అధిష్టానం స్టేట్ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన నాటి నుంచి విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే విజయశాంతి ఎన్నికల బరిలో ఉంటారని రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అమె ఎన్నికల బరిలో లేరు.
అయితే.. ఇటీవల తరచుగా ఆమె పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు.. కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలవేవి ఖండించని ఆమె.. తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్(Congress) నేత మల్లు రవి(Mallu Ravi).. ఆమె కాంగ్రెస్‌లో చేరతారంటూ ఈనెల 11న చెప్పారు. అప్పుడు స్పందించిన విజయశాంతి.. అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. ఖండించిన నాలుగురోజుల్లోనే విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం కాషాయ పార్టీలో సంచలనంగా మారింది.