భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే(BJP MLA) ఈటల రాజేందర్(Etela Rajender), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC Revanth Reddy)కి హితబోధ చేశారు సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijaya Shanthi). పరస్పరం సవాళ్లు విసురుకోవడంపై ఆమె స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్‌ఎస్(BRS)కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు. దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని విజయశాంతి పిలుపునిచ్చారు.

Vijayashanti
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే(BJP MLA) ఈటల రాజేందర్(Etela Rajender), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC Revanth Reddy)కి హితబోధ చేశారు సీనియర్ నాయకురాలు విజయశాంతి(Vijaya Shanthi). పరస్పరం సవాళ్లు విసురుకోవడంపై ఆమె స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్‌ఎస్(BRS)కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు. దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని విజయశాంతి పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోకుండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాటం సాగించాలని సూచించారు.
మునుగోడు ఉప ఎన్నిక(Munugdu By Poll) సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్(TS CM KCR) నుంచి రేవంత్‌రెడ్డి పాతిక కోట్ల రూపాయలు తీసుకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించడం, దానికి ప్రతిగా రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించడం తెలిసిందే! మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చినవేనని రేవంత్ వ్యాఖ్యానించారు. తాను ఒక్క రూపాయి కూడా బీఆర్‌ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తీసుకోలేదని అన్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు తాను చార్మినార్ భాగ్యలక్ష‍్మి ఆలయంలొ ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలన్నారు రేవంత్‌రెడ్డి. ఈటల ఏ గుడికి రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.
ఈ ఛాలెంజ్‌లు విసురుకోవడంపై విజయశాంతి స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపైఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని ఆమె వరుస ట్వీట్లు చేశారు.
బీఆరెస్‌తో పోరాడే తమ్ముళ్లు @revanth_anumula గారు, @Eatala_Rajender
గారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో... ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ...— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023
